అనాథలకు సేవ చేస్తాం..
1 min read– ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మహబూబ్ బాష
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : అనాథలలో మనోధైర్యం పెంపొందించడంతోపాటు వారిని ఆదుకుంటామని ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మహబూబ్ బాష అన్నారు. శనివారం ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మహబూబ్ బాష, జిల్లా అధ్యక్షురాలు ఎస్. హసీనాబేగం దంపతుల కుమారుడు ఫైసల్ పదవ పుట్టిన రోజు వేడుకలను శనివారం నిరాడంబరంగా కీర్తన బాలబాలికల అనాథ ఆశ్రమంలో నిర్వహించారు. ఆశ్రమంలోని పిల్లలతో కేక్ కట్ చేసి పంచారు. అంతేకాక అన్నం, పండ్లు, స్వీట్లు అనాథ పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మహబూబ్ బాష మాట్లాడుతూ అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి అనాథ అనే భావన ఉండకూడదన్నారు. అనాథలను ఆదుకునేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
జర్నలిస్టుల సేవలు.. భేష్
కరోన సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని,నిరంతరం వార్తలు సేకరిస్తూ ప్రజలకు.. ప్రభుత్వానికి చేర్చే కీలక బాధ్యత వారిదేనన్నారు ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మహబూబ్ బాష. శనివారం తన కుమారుడు ఫసల్ జన్మదినం సందర్భంగా ఎన్డబ్ల్యూపీ జిల్లా కార్యాలయంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా(జిల్లా మైనారిటీ అధికారి) చేతుల మీదుగా జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్, బ్యాగులు అందజేశారు. ఎన్డబ్ల్యూపీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి ఆశీర్వాదంతో జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మహబూబ్బాష స్పష్టం చేశారు. కుమారుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జర్నలిస్టులకు ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనాబేగం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.