బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు : సిడిపిఓ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నందికొట్కూరు క్లస్టర్ అంగన్వాడి సిడిపిఓ కోటేశ్వరమ్మ అన్నారు.బుధవారం మండల కేంద్రమైన మహిళా మండలి సమాఖ్య భవనంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో బాల్య వివాహాల గురించి సమావేశం నిర్వహించారు.ముందుగా సిడిపిఓ మరియు అంగన్ వాడి సూపర్ వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు 18 సంవత్సరాలు,మగ పిల్లలకు 21 సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహాలు చేయాలని చిన్న వయసులో వివాహాలు చేస్తే వారి ఆరోగ్యం దెబ్బ తింటుందని అంతేకాకుండా కలిగేటటువంటి నష్టాల గురించి సిడిపిఓ మాట్లాడారు.చిన్న వయసులో వివాహాలు చేసినట్లయితే రెండు సంవత్సరాలపాటు జైలు శిక్ష మరియు ఒక లక్ష జరిమాన తల్లి దండ్రులకు విధించడం జరుగుతూ ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని ఆడపిల్లల్ని మంచిగా చదివిస్తూ వారి అభివృద్ధికి తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలని ఆమె అన్నారు.అంతేకాకుండా గ్రామ మండల మరియు జిల్లా స్థాయిలో కమిటీలు ఉన్నాయని బాల్య వివాహాలు అరికట్టుటకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం ఉందని అన్నారు.సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా వివాహాలు చేయడం వలన కలిగేటువంటి నష్టాల గురించి తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం సుబ్బయ్య,ఎస్సై మారుతి శంకర్,విఆర్వోలు,అంగన్ వాడి కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.