ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..
1 min readప్రాంతీయ రవాణా అధికారి ..కె శ్రీహరి
పల్లెవెలుగు, ఏలూరు జిల్లా : ద్విచక్ర వాహనం ఉన్న ప్రతి ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఉప రవాణా కమిషనరు ఎస్.శాంత కుమారి సూచించారు. గురువారం ఏలూరులోని స్థానిక నరసింహారావు పేట అగ్నిమాపక కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వాహించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లా రహదారి భద్రతా సమావేశములో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ మరియు జిల్లా రహదారి భద్రతా కమిటి చైర్మన్ ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ వాడాలని ఆదేశించారని, వారి ఆదేశాల మేరకు రహదారి భద్రత చర్యలలో భాగంగా హెల్మెట్ ధారణ పై విస్తృత అవగాహన కలిగిస్తున్నామన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ ధరించకపోవడం వలన రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయాలు కావడంతో మృతి చెందుతున్నారన్నారు. ఏలూరు జిల్లాలో రహదారి ప్రమాదాల శాతము తగ్గించేందుకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రహదారి ప్రమాదాలలో హెల్మెట్ ఉపయోగించడం వల్ల మరణాలు శాతం తగ్గించవచ్చున్నారు. కావున ప్రజలకు, వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకపోవడం కారణంగా జరిగే నష్టాలు అనర్ధాలపై ప్రజలకు అవగాహన కలిగించడం జరిగిందని ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని కోరామన్నారు. ఈ కార్యక్రమములో ప్రాంతీయ రవాణా అధికారి కె శ్రీ హరి, మోటారు వాహనాల తనిఖీ అధికారులు కె. విజయ రాజు, జి.ప్రసాదరావు, కె.వి.ఎస్.ప్రసాదు, వై.సురేష్ బాబు మరియు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.