రక్తహీనత గర్భిణీలను.. చిన్నారులను గుర్తించండి..
1 min read– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
– అంగనవాడి కేంద్రాలలో పౌష్టిక ఆహార అమలు తీరు పరిశీలిస్తున్న..
– డిపిఓ తూతిక శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జిల్లాలో అధికారులందరు గ్రామాల బాట పట్టారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో జిల్లా, మండల స్థాయి అధికారులు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు పరిశీలించి రక్తహీనతతో బాధపడుతున్నగర్భిణులు, చిన్నారులు, బాలింతల వివరాలను నమోదు చేసి నివేదిక జిల్లా కలెక్టరుకు అందించనున్నారు. . ప్రభుత్వం ఉచితంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న గర్భిణులలో, చిన్నారులలో రక్తహీనత ఉన్న కారణాలు గుర్తించి అనుగుణంగా తగు సహాయక చర్యలు చేపట్టే దిశగా కలెక్టర్ ప్రసన్న కలెక్టర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణులకు నెలకు వైస్సార్ కిట్టులు ద్వారా 25 గుడ్లు, 5 లీటర్లు పాలు, 2 కిలో రాగి పిండి, 1 కేజీ అటుకులు, 250 గ్రాములు బెల్లం, 250 గ్రాములు పప్పులు, 3 కేజీలు బియ్యం, అర్ద కేజీ నూనె, 250 చిక్కి ఉచితంగా అందిస్తుంది, చిన్నారులకు అయితే అదనంగా రెండున్నర కేజీలు బాలామృతం అందిస్తుంది. వీటితో పాటు వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి సేవలందించడం జరుగుతున్నా, వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా వైద్యసేవలు అందించి, స్పెషలిస్ట్ వైద్యుల ఆధ్వర్యంలో కాన్పులు చేయిస్తున్న రక్తహీనతతో బాధపడుతున్న విషయాలు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి రావడంతో అధికారులను పల్లెబాట పట్టించి రక్తహీనతతో బాధపడుతున్న ప్రతి వ్య్తక్తిని కలిసి సామజిక ఆర్ధిక అంశాలను గుర్తించి నివేదిక అందించామని ఆదేశాలు జారీ చేసారు. అలాగే బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా 6,7 తరగతులలో డ్రాప్ ఔట్స్ గా ఉన్నారో, పదవ తరగతి చదివి పై తరగతులకు వెళ్లకుండా డ్రాప్ ఔట్స్ గా ఉన్న విద్యార్థులను కూడా గుర్తించి పాఠశాలలు పంపేవిధంగా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విధంగా కార్యాచరణ చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. దీనిలో భాగంగా జిల్లా రెవిన్యూ అధికారి ఏ.వి.ఎన్. ఎస్ మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, పిడి డీఆర్డీఏ విజయ రాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి పూలవర్తి శ్యాంసుందర్, జాయింట్ డైరెక్టర్ సాంఘికసంక్షేమ శాఖ జై ప్రకాష్, వివిధ శాఖాధికారులు, మండల స్థాయి అధికారులు అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి గర్భిణులు, బాలింతలు, యుక్తవయసు పిల్లలలనుంచి వివరాలు సేకరించారు.