వైభవంగా మాతృ శక్తి సమ్మేళనం….
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి – దుర్గవాహిని జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11:00 గం.లకు రెవెన్యూ కాలనీలోని భరతమాత మందిర ప్రాంగణంలో మాతృశక్తి సమ్మేళనం 128 మంది మహిళలు, యువతులు అత్యంత వైభవంగా జరిగింది.జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన ఈ కార్యక్రమం లో ప్రధాన వక్తగా పాల్గొన్న తెలుగు పండితులు,ఉపాధ్యాయురాలు శ్రీమతి కర్నాటి చంద్రమౌళిని మాట్లాడుతూ నేటి సమాజంలో దుర్భరమైన హిందూ స్త్రీల పరిస్థితి దాని ఎదుర్కోవడానికి హిందూ స్త్రీలందరూ సంఘటితమై ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఇంకా మాట్లాడుతూ పూర్వం మన మహిళలు సనాతన హిందూ సంప్రదాయాలను,సంస్కృతిని తు.చ. తప్పకుండా పాటించారని అందువల్లే వారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండేవారని కారణం ఎటువంటి రుగ్మతులకైన రోగాలకైనా వంటింట్లో ఉండే దినుసులతోనే ఔషధాన్ని తయారుచేసి వాడేవారు అలాగే కుటుంబం యొక్క సంప్రదాయం ప్రకారం వచ్చే పండుగలు నోములు వ్రతాలను కుటుంబంలో ఉన్న అందరూ సామూహికంగా నిర్వహించడం వల్ల వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య ఉన్న చిన్న చిన్నవిభేదాలు పండుగలు సందర్భంగా కలిసిమెలిసి ఉండడం వల్ల తుడిచిపెట్టుకొని పోయేవని, అలాగే నిత్యం దంచడం, రుబ్బడం, బట్టలుతకటం , దూరం నుంచి నీటిని తీసుకొని రావటం ఇంట్లో బండలు తుడవడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు కదిలి వ్యాయామం చేరకుండానే గట్టి కండరాలు ఎముకలు ఉండేవి దానికి తగినట్టుగా ఎటువంటి పురుగుమందులు వాళ్లని పంటలు వాటి నుంచి వచ్చిన అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల శక్తి అద్భుతంగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల వల్ల సామాజిక మార్పుల వల్ల అనేక సౌకర్యాలు లభించడంతో చెయ్యడానికి పనికి పని లేక ఊబకాయం పెరిగి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం దీనిని నివారించాలంటే ప్రతి రోజు ఉదయం కనీసం ఆరగంట సూర్య నమస్కారాలు కాసేప ధ్యానం లాంటివి చేసుకొని ఆరోగ్యకరమైన వస్తువులను, పదార్థాలను తింటూ మన జీవనాన్ని సుఖమయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ప్రశ్నించడానికి కూడా నిర్లక్ష్యం వహిస్తున్న హిందూ సమాజాన్ని తట్టి లేపాల్సిన సమయం ఆసన్నమైంది. హిందూ స్త్రీలపై జరిగే అత్యాచారాలు అన్యాయాలను రాజకీయ నాయకులూ కూడా శీతకన్నుతో చూస్తున్న సందర్భాలు మనకు కోకొల్లలు, మరి ఇలా మనం నిరంతరం దీనిని భరించాల్సిందేనా ….??? లేదు దీన్ని ఎదుర్కోవడానికి అందరం కూడా సంఘటితమై ఎక్కడ ఏ సమస్య హిందూ స్త్రీలకు అమ్మాయిలకు వచ్చిన మనందరం గొంతు కలిపి గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. దీనికోసం మాతృమూర్తులందరూ విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగంలో చేయాలని యువతులతో దుర్గా వాహిని విభాగంలో చేయాలన్నారు. అంతకుముందు విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి సౌదీకర్ గౌరి మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ 1964 సంవత్సరంలో ముంబైలోని సందీపని అనే శ్రీ చిన్మయ మిషన్ ఆశ్రమంలో ఆశ్రమంలో స్వామి చిన్మయానంద , మైసూర్ మహారాజా చామరాజ వడయార్ , రాష్ట్రీయ స్వయంసేవక్ ద్వితీయ సర్సంఘచాలక్ శ్రీ గురూజీ గార్ల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రారంభించబడినది. అలాగే మాతృశక్తి – దుర్గావాహిని విభాగాలు కూడా 1984వ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయని నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది మాతృ శక్తి దుర్గా వాహిని కార్యకర్తలు సమాజంలో ధర్మం కోసం దేశం కోసం పని చేస్తున్నారని తెలియజేశారు. మరో ప్రధాన వక్త స్వామిని సుప్రీమానందమాతాజీ మాట్లాడుతూ మన ఇతిహాస పురాణాలలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నదని పరమతస్తులు చెప్పినట్టుగా హిందూ ధర్మం లో స్త్రీల అణిచివేత ధోరణి లేదని దీనికి ఉదాహరణగా సతి అనసూయ ,సతీ సావిత్రి ,సీత మండోదరి , సులోచన, లాంటి ఎందరో మహా పతివ్రతలు తమ అత్యద్భుతమైన పాతివ్రత్య మహిమతో దేవాది దేవతలను ఎదిరించే స్థాయిలోనే ఉన్నారని దీనిని బట్టి స్త్రీ శక్తి ఎంత మహోన్నతమైందో తెలుసుకోవచ్చని ఎంతటి మహానుభావుడైన ఒక తల్లికి పుట్టాల్సిందేనని నవ మాసాలు పోసి కన్న ఆ తల్లి యొక్క జీవితం ధన్యమని అలా పుట్టిన పిల్లలు తమ జీవనాన్ని ఉన్నత స్థితిలో కొనసాగిస్తే అత్యంత సంతోషించేది ఆ తల్లే అని తెలియజేశారు. వాసవి కాలేజ్ పూర్వపు ఉన్నత విద్యా అధ్యాపకురాలైన శ్రీమతి పార్వతీ దేవి మాట్లాడుతూ ఏ ఇంట్లో అయినా పిల్లలకు సంస్కృతి , సంప్రదాయాలు సంస్కారాలు నేర్పించాల్సింది తల్లిదండ్రులని వారి నిర్లక్ష్యం లేదా సమయాభావం కారణంగా పిల్లలు తప్పుదోవ పడుతున్నారని దీన్ని తప్పుగా అనుకోవద్దని తల్లిదండ్రులు కొంత లక్ష్యం వహించి తమ తమ సమయాన్ని కేటాయించి పిల్లలను సరైన దారిలో నడిపించాలని సూచించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి రాధిక నిర్వహించారు. సమారోప్ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డిమాట్లాడుతూ ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంతమంది మాతృమూర్తులను కలిపి ఈ నిర్వహించిన కర్నూలు జిల్లా మాతృ శక్తి దుర్గా – వాహిని కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ నగర అధ్యక్షులు టిసి మద్దిలేటి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సందడి మహేష్ , రాష్ట్ర సాహకోశాధికారి గూడా సుబ్రహ్మణ్యం , బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి , రాష్ట్ర ధర్మ ప్రసాద్ కన్వీనర్ ఏ.వీ. ప్రసాద్, బజరంగ్దళ్ విభాగ్ సంయోజక్ నీలి నరసింహ, విశ్వహిందూ పరిషత్తు జిల్లా కార్యదర్శి మాళిగి భాను ప్రకాష్ జిల్లా కోశాధికారి అయోధ్య శ్రీనివాసరెడ్డి, నగర ఉపాధ్యక్షులు కృష్ణ పరమాత్మ, నగర మాతృ శక్తి సంయోజక శ్రీమతి భార్గవి నగరదుర్గవాహిని సంయోజక శ్రీమతి సింధూర శ్రీవాణి, శ్రీ రామాలయ ప్రఖంఢ అధ్యక్ష, కార్యదర్శి ,మాతృశక్తి, సంయోజక సహ సంయోజిక లైన వెంకటేశ్వర్లు, గిరిబాబు, రాధాదేవి ,శిరీష గారలు, ఇంకా వివిధ ప్రఖండలలో నుండి మాతృశక్తి కార్యకర్తలు అశేష హిందూ సమాజంలోని మాతృమూర్తులు పాల్గొన్నారు.