PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల ఈ- క్రాప్​ పనులు వెంటనే పూర్తి చేయాలి..

1 min read

– రీ సర్వే , గృహ నిర్మాణం, ఉపాధి హామీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ..

అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  రైతుల ఈ-కే. వై.సి., ఈ-క్రాప్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలు నుండి వ్యవసాయం, రీ సర్వే, గృహ నిర్మాణం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, నాడు-నేడు, గ్రామీణ ఉపాధి హామీ, తదితర కార్యక్రమాల అమలుపై సోమవారం  జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్  సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా – పి .ఎం. కిసాన్ పధకం కింద అర్హత ఉన్న ప్రతీ రైతుకు ఆర్ధిక  సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపిడిఓ, వ్యవసాయాధికారులు సమన్వయంతో   రైతుల ఈ-కే. వై.సి., ఈ-క్రాప్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలో 50 వేల  మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేశామని, వారికి బ్యాంకుల ద్వారా సాగుకు  పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, రుణాల మంజూరులో ఏమైనా సమస్యలు ఉంటె వెంటనే తన దృష్టికి తీసుకువస్తే, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందన్నారు.  రీ సర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలనీ, గ్రౌండ్ ట్రూతింగ్ ., జి.వి., పనులను నిర్దేశించిన మేర లక్ష్యాలను సాధించాలన్నారు. రీ సర్వే పూర్తి ఐన ప్రదేశాలలో స్టోన్ ప్లాంటేషన్ వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే ను ప్రాధాన్యత అంశంగా తీసుకుని రెండురోజుల్లో నూరు శాతం  సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయాలన్నారు.  జగనన్న ఇళ్ళు పధకం కింద జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు చేపట్టామని, ప్రభుత్వ ఆర్ధిక సహాయం, ప్రోత్సాహకాలను లబ్దిదారులకు తెలియజేసి, వారిని  చైతన్య పరచి , గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.  జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో మరింత మంది పాడి రైతులు భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.   జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, డిఆర్ఓ ఏ వి.ఎన్.ఎస్.మూర్తి, డి ఆర్ డి ఏ పీడీ విజయరాజు, జిల్లా వ్యవసాయాధికారి వై. రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author