వ్యాక్సినేషన్ లో కేంద్రం విఫలం: కేటీఆర్
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ట్విట్టర్ వేదిక నెటిజన్ల అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభా కి వ్యాక్సిన్ అందిస్తే.. భారతదేశ వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10 శాతం కూడా దాటలేదన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, యుకె ,జర్మనీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలన్నీ తమ పౌరులకు వాక్సిన్ ఉచితంగా అందిస్తే భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు అతి తక్కువ గా ఉందన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లల పైన అత్యధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా వ్యాక్సిన్ కి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమైనట్టు, దీంతో విదేశాల్లోనూ పలు ఇతర కంపెనీలు కూడా పిల్లలపైన వ్యాక్సిన్ ట్రయల్స్ ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.