ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
1 min read– విద్యార్థులకు చదువుతోపాటు ఉన్నత విలువలు నేర్పించే దిశగా చర్యలు తీసుకోవాలి
– జిల్లా ఇంచార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : విద్యార్థులకు చదువుతోపాటు ఉన్నత విలువలు నేర్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఉపాధ్యాయులను ఆదేశించారు.మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందచేసిన ఇంచార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య జిల్లా ఇంచార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ పెద్దలు ఉపాధ్యాయులను దైవంగా చూసేవారని, తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే విద్యార్థులకు అవసరమైన విద్యా బుద్ధులు నేర్పడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ఉన్నత విలువలు నేర్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. నా జీవితంలో కూడా ఎంతో మంది ఉపాధ్యాయుల కృషి వలన ఈ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు వారికి నిర్దేశించిన సమయంలో వారికి విద్యను అందజేయాలన్నారు. విద్యార్థులకు అనుగుణంగా బోధన తీరును కూడా మార్చుకొని విద్యార్థులకు అవసరమైన విద్యను బోధించాలన్నారు.జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేశారని అన్నారు. విద్య నేర్చుకున్న విద్యార్థి కుటుంబానికి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొని రాగలరని అందుకొరకే మన ముఖ్యమంత్రివర్యులు విద్యార్థులకు విద్యను ఆస్తిగా అందిస్తున్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలే మార్చేశారు పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో గౌరవమైన వృత్తి అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య పైన ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలలను మంచిగా తీర్చి దిద్దినారని పాఠశాలలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పోషక విలువలు కలిగిన నాణ్యతగల భోజనం అందిస్తున్నారని. పాఠశాలలో చదివే విద్యార్థులకు వైయస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు జరిపించి దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలను కూడా అందేలా చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు నాణ్యత గల విద్యను అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గురువులకు ఇచ్చే విలువలను కచ్చితంగా ఇస్తుందని ఆయన తెలియజేశారు. కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రతి విద్యార్థులు తమ జీవితంలో ఉత్తమ విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో దూర ప్రయాణాలు చేసి విద్యార్థులకు విద్యను బోధించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో చక్కని మౌలిక సదుపాయాలు కల్పించాలనే ధృడ సంకల్పంతో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాడు-నేడు ద్వారా పాఠశాల రూపు రేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు ఆంగ్ల భాష పట్ల అవగాహన కల్పించడానికి టోఫెల్ లాంటి ఉన్నత స్థాయికి విద్యాసంస్థలు అనుసంధానం చేయడంతో పాటు బైజూస్ కంటెంట్ తో కూడిన టాబ్స్ కూడా అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి విద్యా సంస్కరణలలో ఉపాధ్యాయులు ప్రత్యేక పాత్ర పోషించడం జరుగుతుందన్నారు. నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయుల దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ రాష్ట్రపతి స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉంటారని వారే విద్యార్థులకు క్రమశిక్షణతో మెలిగే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అన్నారు. గతంలో పూర్వపు జిల్లా కలెక్టర్ శ్రీ పి.కోటేశ్వరరావు గారు వారి అబ్బాయిని అంగన్వాడీ పాఠశాలలో చేర్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో బల్లలు, బోర్డులు అవసరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండేవి కాదని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజన రూపంలో అందిస్తూ వారిలో రక్తహీనతను తగ్గించడానికి రాగిజావను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యాపకుడిగా, వైస్ ఛాన్సలర్ గా, దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితరసాధ్యం అని అన్నారు. ఆయన జీవన ప్రయాణాన్ని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ఈరోజు శాలువాలతో సన్మానించి మెమెంటోలు ప్రధానం చేయడం జరిగింది అన్నారు.అనంతరం చూపరులను ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన 68 మంది ఉపాధ్యాయులకు శాలువలతో సన్మానించి మెమొంటోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నా సరరెడ్డి, సర్వ శిక్ష అభియాన్ పి ఓ డాక్టర్ కే వేణుగోపాల్, డైట్ ప్రిన్సిపాల్ వసుంధర దేవి, డిప్యూటీ డిఇఓ, జిల్లాలోని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.