PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోండి

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం కలెక్టర్  ఛాంబర్ నందు జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ (PC&PNDT act) సమావేశం ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ సెంటర్ లలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసే హాస్పిటల్, స్కానింగ్ సెంటర్ల పై ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్ చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ కొరకు  దరఖాస్తు చేసుకున్న యాజమాన్యాల వారిని సమావేశపరిచి వారికి అవగాహన కల్పించి అనంతరం తదుపరి ఆమోదం తెలియజేయాలని కలెక్టర్ కమిటీ మెంబర్లకు సూచించారు. సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమే అని లింగ వివక్ష ఉండకూడదని పేర్కొన్నారు. గర్భంలో ఉన్న పిండం, తల్లి ఆరోగ్య పరిస్థితిపై పరీక్ష కోసం స్కానింగ్ పరికరాలు వాడాల్సి ఉంటుందని, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా  భ్రూణ హత్యలను నివారించవచ్చు అని అన్నారు.  భ్రూణ హత్యలతో భవిష్యత్తులో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు. గర్భస్థ పిండ  లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్ల వారి  రిజిస్ట్రేషన్ తొలగించడం మరియు క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.ప్రజలలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం పై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కార్యక్రమంలో 7వ అడిషనల్ డిస్టిక్ట్ సెషన్స్ జడ్జి బి.భూపాల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ టి.సర్కార్,DM&HO రామ గిడ్డయ్య, డాక్టర్ బాల మద్దయ్య,తదితరులు పాల్గొన్నారు.

About Author