ఉద్యమ కార్యచరణను విజయవంతం చేయండి: ఫ్యాప్టో
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో సుమారు మూడున్నర లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గల్లి గల్లిన సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని మేము అధికారంలోకి వచ్చిన ఒక వారంలోపే అమలు చేస్తామని చెప్పి కమిటీలతో కాలయాపన చేసి చివరకు జిపిఎస్ అమలు చేస్తామనీ అందుకు అనుగుణంగా మంత్రి మండలి లో జిపిఎస్ బిల్లుకు ఆమోదం తెలపడానికి నిరసనగా రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వం ఉద్యమ కార్యచరణను ప్రకటించిందని రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కే. ప్రకాశ్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయ రాజు,జిల్లా ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీ జనరల్ ఎస్ .గోకారి జి తిమ్మప్పలు స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవన్లో జరిగిన ఫ్యాప్టో ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. పాత పెన్షన్ విధానం (OPS) సాధించెంత వరకు పోరాటం చేస్తామని నాయకులు తెలిపారు.ఈ ఉద్యమం నకు ఏ పి సి పి ఎస్ ఇ ఏ వాళ్ళు ఈ ఉద్యమం లో పాల్గొంటున్నారు.ఈ ఉద్యమం లో కలసి వచ్చే అన్ని ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాలను ఆహ్వానిస్తున్నాం అని రాష్ర్ట నాయకులు తెలిపారు.
ఉద్యమ కార్యచరణ
1).22 .9 .23న ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు కావాలని హాజరుకావాలని 2) 23 9 23న సాయంత్రం తాలూకా కేంద్రాలలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టాలని 2).25 .9 .23న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరై ఉద్యమకార్యాచణను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ నుండి యస్.జయ రాజు ఎస్ టి యు నుండి టీకే జనార్ధన్ ఎపిటిఎఫ్ 1938 నుండి ఎస్. ఇస్మాయిల్ ,ఐ మరియానందం ఏపీటీఎఫ్ 257 నుండి ఎం రంగన్న ,హెచ్ఎంఏ నుండి వై నారాయణ, శ్రీనివాస్ యాదవ్ అప్టా నుండి ఆర్ సేవాలాల్ నాయక్ బిటిఏ నుండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.