గర్భిణీలు- బాలింతలు కోసం టెక్ హోమ్ కిట్స్
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండలంలోని కుంభలనూరు లో కార్యక్రమం నిర్వహించగా ఒకటి నుంచి పదిహేను రోజు లోపల లబ్ధిదారులకు ఈ కిట్స్ అందుతాయి, ఒక్కో పౌష్టికాహార కిట్ లో మూడు కిలోల మేలు రకం బియ్యం కేజీ పప్పు అరా లీటరు వంటనూనె రెండు కేజీల రాగి పిండి కేజీ అటుకులు 250 గ్రాముల బెల్లం 25 గ్రాముల ఎండు ఖర్జూరాలు 13 కోడిగుడ్లు రెండున్నర లీటర్లు పాలు ఉంటాయి. గర్భిణీలు బాలింతలకు వారి ఇళ్ల వద్దకే ఈ పౌష్టికాహార కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. వాలంటీర్ల వాలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు వీటిని అందజేస్తుంది తాజాగా ఆయా కిట్లను గర్భిణీలను బాలింతల ఇళ్ల వద్దకి పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది అంగన్వాడి కేంద్రాల వద్దకు వెళ్లి వాటిని తెచ్చుకోవడంలో గర్భిణీలు బాలింతలు పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో భాగంగా టెక్ హోమ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అఖిల, అంగన్వాడి టీచర్ జ్యోత్స్న పాల్గొన్నారు.