ఆయుష్మాన్ భవ పై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : సేవా పక్వడా కార్యక్రమం లో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని ప్రజా ఆరోగ్య సంక్షేమము కొరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఆయుస్మాన్ భవ కార్యక్రమంను ప్రారంభించడం జరిగిందని సిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు, శుక్రవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి వైద్యుల తో పాటు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ హాజరయ్యారు, ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు మాట్లాడుతూ, ఆయుష్మాన్ భవ సేవా పక్వాడ కార్యక్రమం పై ప్రజలలో అవగాహన, అదేవిధంగా ప్రచారం నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు, అలాగే రక్తదానం, అవయవ దానం, ప్రాథమిక ఆరోగ్య సమస్యలు వంటి వాటిపై వారు మాట్లాడడం జరిగింది, ప్రజలలో వీటిపై అవగాహనతో పాటు, ప్రచారం నిర్వహించాలని తెలిపారు, ఈ కార్యక్రమం డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.