PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టమోటా కిలో 20 రూ. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

1 min read

సిపిఐ డిమాండ్.

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన టమోటా పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని, కిలో 20 రూపాయలు చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐ మండల సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పత్తికొండ మండల సమితి ఆధ్వర్యంలో పత్తికొండ రెవిన్యూ డివిజన్ అధికారి(RDO) ఆఫీసులో  రెవెన్యూ అధికారి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నబి రసూల్, సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్ గురుదాస్, కారన్న, సిపిఐ మండల సహాయ కార్యదర్శి హెచ్ రంగన్న   సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, పత్తికొండ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి టమోటా పంట సాగు చేస్తూ గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో  టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ పాలకుల  నిర్లక్ష్యo కారణంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీీ ఏర్పాటు హామీగానేేే మిగిలిపోయింది అనిిి అన్నారు.  ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు మేము అధికారంలోకి వస్తే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గత మూడు నెలల కిందట జూన్ ఒకటో తేదీన పత్తికొండ వచ్చిన సందర్భంగా రెండు నెలల్లో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని మరి ఒక్కసారి ఈ ప్రాంత రైతులని మోసం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభం ముందు టమోటా ధర బాగా పలుకుతుందని అరకొర వర్షాలకు రైతులందరూ అధిక వడ్డీలకు అప్పు తెచ్చి టమోటా పంట సాగు చేశారనిి తెలిపారు. ఈసారి సరిగా వర్షాలు రాక  టమోటా మొక్కలకు నీరు పోసి పెంచి టమోటా పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ కి తీసుకపోగా  ధరలు లేక మధ్య దళారులు సిండికేట్ గా మారి టమోటా పంటను రైతులు నుండి కారుు చవుకగా కొనుగోలు చేస్తున్నారనిిిి ఆందోళన చెందారు.  రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాక టమోటా పంటను మార్కెట్లోనే పారబోస్తున్నారు అని అన్నారు. ఈ పరిస్థితులలో రైతులు తీవ్రఆవేదనతో  తమ గోడు ఎవరికి చెప్పాలని కన్నీటి పర్యంతమవుతున్నాారన్నారు. ఇప్పటికైనా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఈ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టటర ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతు పండించిన పంటను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుుచేయాలని కోరారు.లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు .జోలపురం కాశి. నాగిరెడ్డి .నర్సింలు. లాలప్ప. హనుమంతు. పులికొండ. తదితరులు పాల్గొన్నవారు.

 

About Author