జిల్లా కలెక్టరేట్ ముట్టడి ని విజయవంతం చేయండి
1 min read– ఫ్యాప్టో , ఫోర్తో, ఏ పి సి పి ఎస్ ఇ ఏ & ఎ పి సి పి ఎస్ యు ఎస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో సుమారు మూడున్నర లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గల్లి గల్లిన సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని మేము అధికారంలోకి వచ్చిన ఒక వారంలోపే అమలు చేస్తామని చెప్పి కమిటీలతో కాలయాపన చేసి చివరకు సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ను అమలు చేస్తామనీ అందుకు అనుగుణంగా మంత్రి మండలి లో జిపిఎస్ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 25 .9 .2023 సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలెనని రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాశ్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయ రాజు,జిల్లా ఫ్యాప్టో చైర్మన్, ఎస్ .గోకారి, సెక్రటరీ జనరల్ జి. తిమ్మప్పలు స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవన్లో జరిగిన ఫ్యాప్టో ముఖ్య నాయకుల సమావేశంలో కోరారు. ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఏపీ సిపిఎస్ఈఏ , ఫోర్టో ,ఏపీ సిపిఎస్ ఇ ఎ మరియు ఏ పి సి పి ఎస్ యు ఎస్ సంఘాలు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నన్నాయన్నారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో సభ్య సంఘాలు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్.జయ రాజు ,ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్ధన్ ,ఎపిటిఎఫ్ 1938 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. ఇస్మాయిల్ ,ఐ మరియానందం ఏపీటీఎఫ్ 257 జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రంగన్న ,హెచ్ఎంఏ జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వై నారాయణ, పి.శ్రీనివాస్ యాదవ్ అప్టా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ సేవాలాల్ నాయక్ బిటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏపీ సిపిఎస్ ఈఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి శ్రీనివాసరెడ్డి ,ఫోర్టో నాయకులు వెంకటరెడ్డి ,ధనుంజయ రెడ్డి ,ఏపీ సిపిఎస్ యుఎస్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.