పోటాపోటీగా పత్తికొండ నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పత్తికొండ నియోజకవర్గస్థాయి స్కూల్ గేమ్స్ పోటాపోటీగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన క్రీడా క్రీడలకు ముఖ్య అతిధిగా స్థానిక మండల విద్యాశాఖ అధికారి వి.మస్తాన్ వలి, ప్రధానోపాధ్యాయులు మాలతి, వెంకమ్మ మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వీరేశప్ప హాజరయ్యారు. రెండు రోజులపాటు కబడ్డీ, ఖో-ఖో, బాల్ బాడ్మింటన్, బాడ్మింటన్, వాలీబాల్, త్రోబల్ మరియు అథ్లెటిక్స్ క్రీడలలో అండర్ 14 మరియు 17 విభాగంలో బాలబాలికలకు టోర్నమెంట్ కమ్ సెలక్షన్ విధానంలో జరుగుతున్నాయని, ఐదు మండలాలు (పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, వెల్దుర్తి మరియు కృష్ణగిరి ) నుండి 600 పైగా క్రీడాకారులు గేమ్స్ పోటీలలో పాల్గొన్నారని స్కూల్ గేమ్స్ పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ చందు నాయక్ తెలిపారు. 600 మంది విద్యార్థులకు స్థానిక గర్ల్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. అలాగే బుధవారం బాలికలకు క్రీడా పోటీల సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వ్యాయమా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.