రెగ్యులర్ ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి
1 min readసచివాలయం సిబ్బంది కొరత
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొలగుంద మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి అందులో హోలగుంద లోనే నాలుగు సచివాలయాలు ఉన్నాయి అందులో 44 మంది సిబ్బంది గాను 15 మంది మాత్రమే ఉన్నారు. అందువల్లన సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వం జారీచేసే సర్టిఫికెట్లు కుల ఆదాయ వన్ బి అడంగల్ లాంటి ప్రజలకు సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నారు మరియు మండలంలోని ముఖ్యమైన సమస్య ఆధార్ సెంటర్ మండలానికి ఒక రెగ్యులర్ ఆధార్ సెంటర్ నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే 15 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అని ప్రభుత్వం కొత్తగా నిబంధన పెట్టడం వలన ప్రజలకు సమస్యగా మారింది ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఆలూరుకు గాని ఆదోనికి గాని వెళ్లాలి అధికారులు స్పందించి వెంటనే రెగ్యులర్ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఈ గ్రామ సభలో SDPI ఆలూర్ అసెంబ్లీకమిటీ కోరడమైనది.