వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ లోని 17,20 అంగన్ వాడీ కేంద్రాలలో గర్భిణులకు శుక్రవారం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను మున్సిపల్ వైస్ ఛైర్మన్ అర్షపోగు ప్రశాంతి పంపిణీ చేశారు. ఐసీడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ప్రశాంతి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపంతో కలిగే రక్త హీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు వంటి ఆనారోగ్య సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. నెలకు అవసరమయ్యే 10 రకాలైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు.పట్టణం అంగన్వాడీ-3 కేంద్రంలో గురువారం బాలిలింతలు, గర్భిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను సిబ్బంది పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఒక నెలకు సంబంధించిన 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 3 కేజీల బియ్యం, అర కేజీ కందిపప్పు, అర లీటర్ నూనె, జొన్నపిండి, రాగిపిండి కిట్లను అందజేశారు.కార్యక్రమంలో ఐసీడీస్ సూపర్ వైజర్ ఆశీర్వదమ్మ, అంగన్ వాడీ కార్యకర్తలు చిట్టెమ్మ, రమణమ్మ , మహిళ సంరక్షణ కార్యదర్శి మమత, ఏఎన్ ఎం పద్మావతి, ఆశ వర్కర్లు సత్యమ్మ, పుష్పలత, దివేనమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.