PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించాలి…

1 min read

– కంటి చూపు లేకుండా జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని చూడగల అరుదైన శక్తి అందులకు ఉంది

– అక్షిత అంధుల పాఠశాలకు నిత్యావసర వస్తువులు అందజేసిన

 – సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంధత్వంతో ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్  బి. శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగర సమీపంలోని పసుపుల రహదారిలో ఉన్న అక్షిత అందుల పాఠశాల విద్యార్థులకు ఆయన త  నవంతు సహాయంగా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అక్షిత అందుల పాఠశాల నిర్వాహకులు సుధాకర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనిషి పంచేంద్రియాలలో అందత్వమున్నవారు బాధపడాల్సిన అవసరం లేదని ,ఆత్మవిశ్వాసంతో దాన్ని జయించి అందరికీ ఆదర్శంగా నిలిచిన వారు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. కంటి చూపు లేని వారు సహజంగా బాధపడుతూ కనబడతారని ,కానీ అక్షిత అందుల పాఠశాలలో అలాంటి భావం  ఎవరిలోనూ కనిపించడం లేదని ,అది వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అని చెప్పారు. భగవంతుడు అంధత్వం రూపంలో కొంత లోటు కల్పించినా, వారిలో జ్ఞాన నేత్రం రూపంలో ప్రపంచాన్ని చూడగలిగే శక్తి ప్రసాదించారు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో చెడు వినకు.. చెడు చూడకు.. చెడు మాట్లాడకు అనే సామెత ఉందని, అందరిలో లాగా చెడును చూసే దురదృష్టం  అంధత్వం ఉన్నవారిలో లేదని ఆయన చెప్పారు. కంటి చూపు లేని వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు బ్రెయిలీ లిపి ఎంతో ఉపయోగపడుతుందని, దానిద్వారా ఎంతోమంది ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడి ఇతరులకు సహాయం చేస్తున్నారని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత స్వంత  లాభాన్ని మానుకొని ఇతరుల సేవకు కొంత మొత్తాన్ని వెచ్చించాలని ఆయన సూచించారు. ఈ సిద్ధాంతాన్ని తాను పాటిస్తూ తన వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వివరించారు .ఇందులో భాగంగానే అక్షిత అందుల పాఠశాల విద్యార్థులకు నెల రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేశానని, భవిష్యత్తులో తన సహకారం కొనసాగుతుందని వివరించారు .అక్షిత అందుల పాఠశాల ద్వారా కంటి చూపు లేని చిన్నారులను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తున్న పాఠశాల నిర్వాహకులు సుధాకర్, చంద్రకళ  ను అభినందించారు. ఇలాంటి పాఠశాల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. కంటి చూపు లేదని బాధపడుతూ కూర్చుంటే జీవితం మరింత అంధకారంలోకి వెళుతుందని ,అలా కాకుండా ఆత్మవిశ్వాసంతో అందత్వాన్ని అధిగమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన కోరారు. యోగ, ధ్యానం వంటి అంశాలలో సాధన చేయించడం ద్వారా వీరిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.

About Author