PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవ మనుగడకు పచ్చని చెట్లు అవసరం..

1 min read

ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల లోని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీ ఆర్. వర్జిల్ జాన్ , ఆర్. సుస్మిత , పి. నీలిమ , ఎ.ప్రవీణ్ కుమార్ రెడ్డి , టి. శ్రీనివాసులు మంగళవారం నాడు పాఠశాల ఆవరనంలో మొక్కలు నాటారు . ఈ కార్యక్రమం గురించి పాఠశాల కరస్పాండెంట్ రామేశ్వరరావు మాట్లాడుతూ భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు మనిషి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ వాయువును బయటికి వదులుతారని. అలా మనిషి వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ వాయువును చెట్లు పీల్చుకొని అవి మరల మనిషికి ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయన్నారు అందువలన భూమిపై చెట్లు లేకపోతే ఇక మనిషి జీవించడం కష్టతరమవుతుందని చెట్లు ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో సహాయపడుతాయని అన్నారు. పర్యావరణ సమతుల్యత వలన సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి అని పాఠశాల కరస్పాండెంట్  శ్రీ ఎం. రామేశ్వర రావు  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఎం.బి.యన్. రాఘవేంద్ర రావు , పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

About Author