తాడేపల్లిగూడెంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..
1 min read– శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపామని వెల్లడి..
– ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి : స్థానిక తాడేపల్లిగూడెం ముబారక్ బిర్యానీ పలావ్ సెంటర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు.బిర్యానీ సెంటర్ నందు వారు తయారు చేస్తున్న ఫుడ్ శాంపిల్స్ ను తనిఖీల్లో భాగంగా అధికారులు కలెక్ట్ చేసుకున్నరు. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం లేబ్ కు పంపామని వెల్లడి చేశారు.పంపిన శాంపిల్స్ పై నిర్ధారణ రాగానే వాటి ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు మరియు ప్రజల ఆరోగ్యాలపై చెలగాటమాడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు.వినియోగదారులు వారించినప్పటికీ వారు తీరు మారని అనేక కర్రీ పాయింట్ లు, చికెన్ పకోడీ సెంటర్ నిర్వాహకులు తమదైన శైలిలో లాభాల అర్జునులనే తప్ప వినియోగదారుల ఆరోగ్య న్ని తుంగలో తొక్కుతున్నారన్నరు.నిల్వ ఉన్న కోడి గుడ్లు వాసన రాకుండా నిమ్మ కాయ బద్దలను వేసి ఉడికిస్తున్నరని వాపోయారు.కార్మిక చట్టాన్ని, బాలుర సంక్షేమ చట్టాన్ని యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ మైనర్లతో పలావ్ సెంటర్ లో పనులు చేయించుకుంటున్నరన్నరు.హోటల్ లో కమర్షియల్ గ్యాస్ బండలు వాడాల్సి ఉండగా వాటితో పాటుగా డొమెస్టిక్ (గృహంలో వినియోగించే) గ్యాస్ బండలు వాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న రన్నారు.తూతూ మంత్రంగా కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ తీసుకోవడమే తప్ప మిగిలిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి ప్రజారోగ్యాలను కాపాడాలన్నారు. ఫైర్ సేఫ్టీ, రెవిన్యూ, కార్మిక, బాలుర సంక్షేమ చట్టం, ఆహార నియమ నిబంధనలను యాజమాన్యం పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని భోజన ప్రియులు ప్రజలు కోరుతున్నరు.