PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

1 min read

– ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో.

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  ఆటో కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ బుధవారం  ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక నందికొట్కూరు పట్టణంలో పటేల్ సెంటర్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల  రాస్తారోకో నిర్వహించారు.కార్మికులను ఉద్దేశించి ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి రఘురామమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ తర్వాత అతి పెద్ద రంగము ఆటోరంగమని వారన్నారు.ఆటో కార్మికులు ఆటోను కొనుగోలు చేసేటప్పుడు రోడ్ టాక్స్ ఇన్సూరెన్స్ గ్రీన్ టాక్స్ వంటి వివిధ టాక్స్ ల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని,అదేవిధంగా ఆటో కార్మికుల పైన అధిక జరిమానాలు విధించడం రద్దు చేస్తానని మరియు ఆటో కార్మికులకు ప్రమాద బీమా  రూ. 10 లక్షల చెల్లిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు.  ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని వారన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లపై ఆర్డీవో, పోలీస్ అధికారులు పెడుతున్న అక్రమ కేసులు విధించరాదని వారన్నారు.50 సంవత్సరాల ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు సామాజిక పెన్షన్ రూ.6 వేలు  మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ చాలాన, జరిమానా విధించే జీవో 21, జీవో 31 తక్షణమే రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. ఆటోలపై పెంచిన గ్రీన్ టాక్స్ ను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో  రాబోయే సార్వత్రిక  ఎన్నికల్లో ప్రభుత్వాన్ని  గద్దె దించుతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ తాలూకా కమిటీ కన్వీనర్ కో కన్వీనర్స్ వి. వీరస్వామి, పి. సురేష్, యుగేందర్ గౌడ్, చెన్నయ్య ,సద్దాం ,శ్రీనివాసులు, నాగరాజు, బాలస్వామి, చంద్రశేఖర్, బాబు, ఏ. జమ్ములయ్య  మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మహానంది ,దినేష్ వీరేంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు .

About Author