PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సిపిఐ            

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండలంలో పంట పరిశీలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య , జగదీష్ , నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పరిశీలించారు.ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాం లో రైతుల పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కరువు స్థాయిలు ఏర్పడినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని వారు మండి పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వలసలుగా ఇతర రాష్ట్రాలకి పోతున్నప్పటికీ  ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఎమ్మిగనూరు బహిరంగ సభలో రైతులను ఆదుకుంటారని హామీ ఇస్తారని ఆశించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి  అక్కడ మాట్లాడకపోవడం రైతుల పట్ల తన వైఖరి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని వారు అన్నారు.డోన్ నియోజవర్గంలో  106 చెరువులకు నీళ్లు నింపకుండా కేవలం  ఓపెనింగ్ ప్రచారానికి పరిమితమైందని వారు అన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో పంటలు వేసిన రైతులను ఆదుకోవాలని, పంట నష్టపరిహారం కింద 30 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, బ్రాహ్మణ స్థాయిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని పక్షంలో   రైతులను కలుపుకొని రాష్ట్రంలో ఎక్కడా కూడా మిమ్మల్ని తిరగనియ్యమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, మోటార్ రాముడు,ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారుమంచి,ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్, జిల్లా కోశాధికారి సురేష్ ,ప్యాపిలి మండల కార్యదర్శి వెంకటేష్, జిల్లా సమితి సభ్యులు పులి శేఖర్, ఎఐవైఎఫ్  జిల్లా నాయకుడు రంగస్వామి యాదవ్, ఎఐఎస్ఎఫ్  సహాయ కార్యదర్శి శివ కేశవులు, మనోజ్, శశిధర్ రెడ్డి, బంగారప్ప, ఈశ్వర్, వంశి,వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

About Author