PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

1 min read

– త్వరగతిన కారుణ్యలో ఉద్యోగ కల్పనకు ఏర్పాట్లు..

– గంధం నరేంద్ర కుటుంబ సభ్యులకు 1,31,020/- రూ:  చెక్కు అందజేత..

– ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  అమరవీరుల సంస్మరణ దినోత్సవం 2023 ను పురస్కరించుకొని ఈరోజు అనగా 19వ తేది నాడు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం లో గల సమావేశం లో ఏలూరు జిల్లా ఎస్పీ  డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో ఉన్న సమయంలో   అఘాతకుడు దాడిలో మరణించిన గంధం నరేందర్  యొక్క సంస్మరణ దినోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గంధం నరేంద్ర యొక్క కుటుంబ సభ్యులకు ఏలూరు జిల్లా పోలీస్ తరఫున ఏలూరు జిల్లా ఎస్పీ  తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేసి సారు. గంధం నరేంద్ర తో పనిచేసిన సహోదయగులు మరియు ఆగిరిపల్లి ఎస్సై చంటి బాబు  మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత ప్రజాసేవకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని ఏలూరు జిల్లా పోలీసు వారు కోల్పోవడం ఎనలేని లోటు అని అతనితో గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి వారి యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియ చేసిఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్  ఎం జె వి భాస్కర రావు  మాట్లాడుతూ గంధం నరేంద్ర తో తనకున్నటువంటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ అధికారులు చెప్పిన వెంటనే స్పందించి ఉద్యోగ నిర్వహణ చేసే వ్యక్తిని కోల్పోవడం ఇబ్బందికరమైనటువంటి విషయమని అలాగే అతనికి ప్రభుత్వపరంగా మరియు పోలీస్ సిబ్బంది పరంగా అందవలసిన రాయితీలు అన్నీ వచ్చేలాగా మరియు గంధం నరేంద్ర యొక్క భార్యకు ఉద్యోగ కల్ప కారుణ్య నియమకాల్ని త్వరగా అందించేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ  ని అభ్యర్థించినారు. అడ్ హుక్ పోలీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్  మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి గంధం నరేంద్రను వెనకనుంచి గాయపరిచి చనిపోవుటకు కారణమైనటువంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకునేలాగా జిల్లా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లా పోలీస్ తరఫున వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ కార్యక్రమంలో తెలియ చేసినారు. జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ గంధం నరేంద్ర చనిపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఎనలేని లోటని గంధం నరేంద్ర ఆత్మకు శాంతి కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని రెండు నిమిషంలో పాటు మౌనం పాటించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ ఇప్పటికే ప్రతిపాదనలను చీఫ్ ఆఫీసులకు పంపించినట్లు అవి అందేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు వారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా జిల్లా ఎస్పీ ని ఎప్పుడైనా కలవచ్చునే వారు యొక్క సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ  నరేంద్ర కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఉప్పాడ రవి ప్రకాష్ ఐ .పి.యస్ వారు వారి యొక్క పోలీసు సిబ్బంది యావన్మంది నుండి ఆర్థిక సహాయం ను  గంధం నరేంద్ర  కుటుంబానికి 1,31,020 రూ. ల చెక్కును నరేంద్ర కుటుంబ సభ్యులకు అంద చేసినారు.ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం నుండి ఒక చెక్కును అంద చేసినారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఎస్పి ఎం రమేష్ రెడ్డి , ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు, డి టి సి డి ఎస్ పి కే ప్రభాకర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్ రాజశేఖర్ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోమాకల శివాజీ, నిడమర్ సిఐ ఎం సుభాష్,  వెల్ఫేర్ మోడల్ ఆర్ ఐ పవన్ కుమార్, జిల్లా అడ్ హుక్ కమిటీ ప్రెసిడెంట్ మరియు పోలీస్ సిబ్బంది ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author