భారతీయ విద్యార్థులకు న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లు
1 min readGet2Uni.com తో ప్రత్యేక భాగస్వామ్యం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత విద్యావకాశాలు కోరుకునే భారతీయ విద్యార్థులకు న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ (ఎన్ఎంఎస్‌యూ) సాదర స్వాగతం పలుకుతోంది. ఘనమైన చరిత్ర కలిగిన ప్రముఖ విద్యాసంస్థ అయిన ఎన్ఎంఎస్‌యూ భారతీయ విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అనేక కోర్సులను రూపొందించింది, వాటిలో స్పాట్ అడ్మిషన్లను ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా Get2Uni.com తో ప్రత్యేక భాగస్వామ్యం ఏర్పరుచుకుని, ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం అక్టోబర్ 23న ఉదయం 10 గంటల ఉనంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్ఎంఎస్‌యూ హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక్కడకు వచ్చే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు ఉండే సందేహాలను తీర్చేందుకు, వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు యూనివర్సిటీ నుంచి నలుగురు ఉన్నతస్థాయి ప్రతినిధులు వస్తున్నారు. వారిలో ఎన్ఎంఎస్‌యూ బోర్డు ఛైర్ రీజెంట్ అమ్ము దేవస్థలి, ఎన్ఎంఎస్‌యూ గ్లోబల్ ఛాన్స్‌లర్ డాక్టర్ షెర్రీ గోల్డ్‌మన్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెస్లీ కెర్వాంటెస్, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ లక్ష్మీరెడ్డి ఉంటారు. వీరంతా తమ అపార విజ్ఞానం, అనుభవాలను విద్యార్థులకు పంచుతారు. Get2Uni.com తో ఎన్ఎంఎస్‌యూ భాగస్వామ్యం వల్ల భారతీయ, నేపాలీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యావకాశాలు కల్పించే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ సంయుక్త కృషితో వ్యవసాయం, మేనేజ్‌మెంట్, బయాలజీ, బయోమెడికల్ సైన్సెస్, లిబరల్ ఆర్ట్స్, సైన్స్, సైకాలజీ, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్సెస్.. ఇంకా మరెన్నో రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుకేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నారు. వీటితోపాటు యూనివర్సిటీ ద్వారా 70కి పైగా ప్రత్యేకమైన డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టి, ముఖ్యంగా ఈ ప్రాంత విద్యార్థులకు ఉండే విభిన్న విద్యాసక్తులకు అనుగుణంగా బోధిస్తారు. ఈ సందర్భంగా Get2Uni.com ప్రెసిడెంట్ పవన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న వేలకొద్దీ యూనివర్సిటీలలో ఏది సరైనదో ఎంచుకోవడానికి భారతీయ విద్యార్థులు కొంత ఇబ్బంది పడతారని చెప్పారు. అయితే, అచంచలమైన పేరు ప్రతిష్ఠలు, విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్ కార్యక్రమాల ద్వారా ఎనలేని మద్దతు అందిస్తున్న ఎన్ఎంఎస్‌యూ మాత్రం అన్నింటికంటే విభిన్నంగా, విశిష్టంగా ఉంటుందని తెలిపారు. Get2Uni ప్రత్యేకంగా 3వేల డాలర్ల స్కాలర్‌షిప్ అందిస్తోందని, దాంతోపాటు ఛాన్స్‌లర్ ప్రత్యేకంగా అంతర్జాతీయ విద్యార్థులకు 15వేల డాలర్ల స్కాలర్‌షిప్ ప్రకటించారని, దీన్ని బట్టే చదువు కోసం వచ్చేవారిపట్ల ఎన్ఎంఎస్‌యూకు ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తుందన్నారు. “Get2Uniతో మా ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్, నేపాల్ దేశాల విద్యార్థుల వద్దకు వెళ్లి వారికి మా విద్యావకాశాల గురించి చెప్పడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. భారతీయ సంస్థలతో మరింతగా అనుబంధం పెంచుకుని, ఇక్కడి నుంచి అమెరికా రావాలనుకున్న విద్యార్థులను కలిసి, కార్పొరేట్లతో మరిన్ని భాగస్వామ్యాలు ఏర్పరుచుకోవాలని భావిస్తున్నాం. దీనివల్ల ఎన్ఎంఎస్‌యూలో వైవిధ్యమైన, అద్భుతమైన విద్యా వాతావరణం ఏర్పరచాలన్న మా లక్ష్యం నెరవేరుతుంది” అని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ షెర్రీ కోల్‌మన్ తెలిపారు. తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్ల ద్వారా భారతీయ విద్యార్థులు ఎన్ఎంఎస్‌యూలోని వైవిధ్యమైన కోర్సుల గురించి తెలుసుకోవడానికి, నేరుగా యూనివర్సిటీ ప్రతినిధులతో మాట్లాడటానికి, అద్భుతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ఒక సువర్ణావకాశం లభిస్తుంది. న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ గురించి, స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం గురించి మరిన్ని వివరాలకు www.NMSU.edu సైట్‌ను సందర్శించండి, లేదా [email protected] అనే ఐడీకి ఈమెయిల్ ద్వారా, 89574 98026 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా Get2Uni బృందాన్ని సంప్రదించండి.