PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సంఘటితం కండి..

1 min read

చిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి..

ప్రభుత్వ పథకాలు పునరుద్ధరించారు..

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలి..

ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుమన్

రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి..

జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సంఘటితమై జిల్లా స్థాయిలో బలోపేతం కావాలని ఏపీ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె సుమన్ పేర్కొన్నారు.ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్లో జిల్లా స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహసభ జరిగింది.ఈ సభకు సుమన్ ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు ఈ సభ ఉద్దేశించి సుమన్ మాట్లాడుతూ  ఐకమత్యంతో ముందుకు సాగి ప్రభుత్వాన్ని మెప్పించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆ విధంగా జిల్లాలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సంఘటితం కావాలన్నారు. తక్కువ వేతనానికి ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతాభావంతో పనిచేస్తున్నారని ఆయన అన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేకమైన సర్వీస్ రూల్స్ ను తయారుచేసి అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.చిరుద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఏపీ జెఎసి అమరావతి ఎల్లప్పుడూ చొరవ చూపుతోందని ఆయన తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలకు అనుగుణంగా  వేతనాలు సరిపడక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాలు నిలిపివేశారని దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగ కుటుంబ సభ్యులు  ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ పథకాలన్నీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింప చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చాలీచాలని వేతనాలు అయినప్పటికీ కుటుంబాలను భారంగానే నెట్టుకుని వస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలను కూడా నిలిపివేయడం దారుణమని పథకాలన్నీ పునరుద్ధరించాలని సుమన్ ప్రభుత్వాన్ని కోరారు.ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా అధ్యక్షులు  కె రమేష్ కుమార్ మాట్లాడుతూఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని అభద్రత భావంతో పనిచేస్తున్నారని  తెలుపుతూ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు   ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.      ఏపీ జెఎసి అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగి తమ యొక్క సమస్యల పరిష్కారంలో ఏపీజేఏసీ అమరావతి అండగా ఉంటుందని దానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి మాట్లాడుతూ మహిళలు కూడా ఔట్సోర్సింగ్ ఉద్యమంలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో మేము అండగా ఉంటామని తెలియజేశారు.కార్యక్రమంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు  గురునాథ్,  సుశీల, లక్ష్మీ కుమారి, హైమావతి, రంగ భాస్కర్, కిషోర్, సుబ్బారావు అనిల్ ఆదిరెడ్డి దుర్గ, నాగేశ్వరమ్మ, రాజేష్, నాగేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి  జిల్లాలోనిà వివిధ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author