రీ సర్వే పనులను అనుకున్నంత వేగవంతంగా చేయడం లేదు…
1 min read– జిల్లా కలెక్టర్ డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : రీ సర్వే కి సంబంధించి మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు చేపట్టాలని లేకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా జి.సృజన అన్ని మండలాల తహసిల్దార్లను, సర్వేయర్లను అదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి రెవెన్యూ తదితర అంశాలపై తహశీల్దార్లు, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ, సర్వే సిబ్బందితో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే పనులను అనుకున్నంత వేగవంతంగా చేయడం లేదని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఇచ్చిన గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్ పనులకు సంబంధించి కర్నూలు రూరల్ లోని కొంతలపాడు , పంచలింగాల గ్రామాలు, వెల్దుర్తి మండలం లోని నార్లాపురం, ఆదోని మండలంలోని సంబగల్లు గ్రామాలు నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. ఎల్పిఎం జనరేట్ చేయడంలో వెల్దుర్తి మండలంలోని రామలకోట, హోలగుంద మండలంలోని నగరకన్వి, కల్లూరు మండలంలోని కొంగనపాడు, కౌతాళం మండలంలోని కాటేదొడి, కోసిగి మండలంలోని జంపాపురం, జుమలదిన్నె గ్రామాలు ఎల్పిఎం జనరేట్ చేయడంలో నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయకుండా ఆలసత్వం చేస్తున్నారని, రేపటి లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విలేజ్ సర్వేయర్, విఆర్ఓ లాగిన్ లలో డేటా ఎంట్రీ చేసే పనులలో ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్ల, కందనాతి, ఆస్పరి మండలంలోని కారుమంచి, గూడూరు మండలంలోని నాగలాపురం, మల్లాపురం, మునగాల హోలగుంద మండలంలోని గజ్జెహళ్లి గ్రామాల్లో నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ తీసుకుంటున్నారని త్వరితగతిన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ లాగిన్ లో కూడా నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని, నిర్దేశించిన గడువు లోపు లక్ష్యాలను సాధించకుంటే సంబంధిత వారి మీద చర్యలుతప్పవన్నారు. నవంబర్ 30వ తేది నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫేస్ 3 కి సంబంధించి గ్రౌండ్ ట్రూతింగ్ ఇంకా మొదలుపెట్టాని 23 గ్రామాల్లో త్వరితగతిన మొదలు పెట్టే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్, కర్నూల్, పత్తికొండ ఆర్డిఓ లకు సూచించారు. జగన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో భాగంగా రెవెన్యూకి సంబంధించి 157 రీ ఓపెన్ లో ఉన్నాయని రీ ఓపెన్ కి సంబంధించి ముఖ్యంగా కర్నూల్ రూరల్ లో 18, ఆదోని 5 , ఆస్పరి 11, ఓర్వకలు 12, గొనేగండ్ల 9, హోలగుంద 8, మద్దికేర 8, దేవనకొండ 8 రీ ఓపెన్ కేసులు ఉన్నాయన్నారు. మరి ముఖ్యంగా రీ ఓపెన్ అయిన వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని, అర్జీదారులను పిలిపించి వారు సంతృప్తి చెందే విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడంతో పాటు ఇచ్చిన ఎండార్స్మెంట్ కు తగిన అక్నాలెడ్జ్మెంట్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం చాలా ముఖ్యమని స్పందనకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించాము, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, బియాండ్ ఎస్ఎల్ఎ లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రిఓపెన్ అయ్యాయి అనే సమాచారాన్ని ప్రతి తహసిల్దార్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.కర్నూలు జిల్లాలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిని అసైన్ చేయుటకు గాను జిల్లా అసైన్మెంట్ రివ్యూ కమిటీ 3425 మంది లబ్ధిదారులకు 4116 ఎకరాలు పంపిణీ చేయుటకు ఆమోదించడం జరిగిందని, జిల్లా అసైన్మెంట్ రివ్యూ కమిటీ ద్వారా గుర్తించిన 3425 మంది లబ్ధిదారులకు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారుడిని 6 స్టెప్ వాలిడేషన్ కింద వెరిఫై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎడి సర్వేయర్ మనీకన్నన్, కె ఆర్ సి సి డెప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.