నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నవంబర్ 8వ తారీఖున రాష్ట్రవ్యాప్త కేజీ నుండి పీజీ వరుకు విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని.AISF, AIYF, SFI విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. గురువారం పత్తికొండ చదువుల రామయ్య భవన్లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం లో ఉన్నా బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటుందని అన్నారు. ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఉక్కు కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నవంబర్ 8వ తారీకుకు 1000 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా అలాగే కడప లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థలు బంద్ ను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో కూడా ముందుకు రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నిజంగా ఈ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే జరగబోయే బంద్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించి మీ వైఖరి తెలియపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కును కాపాడుకోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యతని ప్రతి ఒక్కరూ ఈ బందులో భాగస్వాములై బంద్ ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏదో నామమాత్రంగా స్టీల్ ప్లాంట్ వద్ద బహిరంగ సభ పెట్టి చేతులు దులుపుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే వాళ్లతోనే చేతులు కలిపి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కోసం పోరాడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బంద్ కి సంపూర్ణ మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు పెద్దయ్య, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వినోద్ ,రమేష్ ,ఏఐవైఎఫ్ తుగ్గలి మండల అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవి, వినోద్ ,ఉపేంద్ర , ఏఐఎస్ఎఫ్ నాయకులు అహ్మద్, పవన్, లక్ష్మణ్, భాష, ఎస్ఎఫ్ఐ నాయకుడు అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.