PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

1 min read

– కర్నూలు ఎంపీ  డాక్టర్ సంజీవ్ కుమార్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రామాయణాన్ని మధురకావ్యంగా మలిచిన మహనీయుడు, ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు ఎంపీ  డాక్టర్ సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాల్మీకి మహర్షి జయంతోత్సవమునకు ముఖ్యఅతిథిగా   కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్  హాజరైనారు. కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బివై.రామయ్య,  గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, కార్పొరేటర్ శ్వేత రెడ్డి, ఎల్లమ్మ బోర్డ్ ట్రస్ట్ చైర్మన్ బేతం కృష్ణ, ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ గౌతం,పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కర్నూలు ఎంపీ  మాట్లాడుతూ హిందూ లోకానికి  ఆదికవి మొదటి కావ్యాన్ని రచించి ఒక మంచి జీవన విధానాన్ని ఎలా ఉండాలో  తెలియజేసిన గొప్ప వ్యక్తి మహర్షి వాల్మీకి గారని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వాల్మీకి జయంతోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. మహర్షి వాల్మీకి ధ్యానం చేసే సమయంలో వచ్చిన  ఆలోచనలు అన్ని పుస్తక రూపంలో రచించి 24 వేల శ్లోకాలు  అందించిన మొట్టమొదటి  హిందూ వాల్మీకి రామాయణం అన్నారు. కొన్ని సంవత్సరాలు హరినారాయణ స్మరణం చేస్తున్న సమయంలో అతని చుట్టూ చీమల పుట్ట వచ్చిందని ఆ చీమల పుట్టని సంస్కృతి భాషలో  వాల్మీకి అంటరాని ఈ విధంగా అతనికి వాల్మీకి అనే పేరు వచ్చిందని తెలిపారు. బోయ అంటే భయం లేనివారని వారు నమ్మితే ఎందాకైనా వస్తారని వారిలో క్షత్రియ గుణాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. బోయ కులం వారిలో బుద్ధి బలం, క్షత్రియ గుణాలు, బ్రాహ్మణత్వం  కలిగి ఉంటాయని ఇటువంటి గుణాలు అన్నిటిని  మీ పిల్లలకు  నేర్పించి వారు ఉన్నత స్థానాలలో ఉండే విధంగా కృషి చేసి చేయాల్సిన బాధ్యత మీ మీద ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యంతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని  భావించి పిల్లలందరూ విద్యను అభ్యసించేందుకే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు వివిధ పథకాల  ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో పునరుద్ధరించి మన పిల్లలకు ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనన్నారు. అదే విధంగా వైద్యానికి సంబంధించి వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో వైద్య సేవలు చాలా మెరుగుగా ఉన్నాయని ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని   అయుష్మన్ భారత్ పథకం ప్రవేశపెట్టారన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వ హయాంలో  వాల్మీకులకు పెద్దపీట వేసి ఎన్నో పదవులు, పథకాలను ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అన్నారు. నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహర్షి సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వ్యక్తి వాల్మీకి మహర్షి అని అన్నదమ్ములు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే జీవన విధానాలను తెలిపిన మహనీయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరిందని కుల మతాలకు అతీతంగా  అర్హులైన వారందరికీ కూడా  సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో వాల్మీకులను ఎస్టీలుగా చేసేందుకు కృషి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి కూడా పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలను ఆర్థికపరంగా, సామాజికపరంగా, విద్యాపరంగా ఎన్నో అవకాశాలు కల్పించారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని విధంగా పదవులను  ఇచ్చారని, ఇందులో భాగంగా  వాల్మీకులకు కూడా ఎన్నో రాజకీయ పదవులను పొందరన్నారు. గతంలో వాల్మీకులు  కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయుటకు తన దృష్టికి తీసుకొని వచ్చారని, ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు పర్యటనలో  ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళమని తెలిపారు. ముఖ్యమంత్రి  స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా  జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారని అతి త్వరలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా గౌరీ గోపాల్ ఆసుపత్రి సర్కిల్ నందు ఎత్తయిన వాల్మీకి మహర్షి కాంస్య  విగ్రహాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన  మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  ప్రపంచానికి, దేశానికి, కుటుంబ సభ్యులకు మార్గదర్శకాలను చూపించే విధంగా రామాయణం లాంటి  గొప్ప కావ్యాన్ని  రచించి ప్రపంచానికే మహర్షి వాల్మీకి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉండే చెడును వదిలేసి సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలన్నారు. వాల్మీకి, బోయలు   ప్రాంతాల వారీగా విభజించారని కోస్తా ఏజెన్సీలో ఎస్టీ, కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీ, నార్త్ ఇండియా మొత్తం ఎస్సీ లు గా ఉన్నారని, ఇక్కడ మాత్రం బిసి లు గా కొనసాగుతున్నామని మమల్ని కూడా ఎస్టీ లో చేర్చే విధంగా పోరాటం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, పార్లమెంట్ సమావేశాలలో ఈ విషయాన్ని రాష్ట్ర ఎంపి లు లేవనెత్తారని  ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మమ్మ, బిసి వెల్ఫేర్ జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జనరల్ సెక్రెటరీ గిడ్డయ్య,వైఎస్సార్సీపీ జిల్లా మహిళ  అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బుజ్జమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య,మైనారిటీ సంక్షేమ నాయకులు షేక్ యూనిస్ భాష, బిసి నాయకులు బత్తుల కాంత్,బిసి నాయకులు ధనుంజయ చారి, కప్పట్రాళ్ల రామచంద్ర నాయుడు,  వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నాయకలు, బిసి సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author