పార్టీలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్.. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్, వెల్దుర్తి : సీఎం సహయనిధి క్రింద మంజూరైన 7మందికి 7లక్షల 48 వేల రూపాయల చెక్కులను బాధితులకు వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామంలో అందజేసిన,ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ క్రిష్ణగిరి,తుగ్గలి,వెల్దుర్తి మండలాల లోని సీఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరైన చెక్కులను ,ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు, బాధితులకు అందజేశారు. ఆరోగ్యశ్రీ క్రింద లేనటువంటి చికిత్సలు అన్నిటికీ కూడా సీఎంఆర్ఎఫ్ క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
1. ఈడిగ నారాయణ, కర్లకుంట – 30,000/-
2. మంగలి జ్యోతి,గువ్వలకుంట్ల -36,000/-
3. షేక్ రతన్ దాదా ఇంతియాజ్ భాష బొందిమడుగుల -2,00,000/-
4. అప్ప విమల, ఉపర్లపల్లి -1,20,000/-
5. కురువ యెల్లకృష్ణ, లక్ష్మీ నగరం -22,000/-
6. నర్సింగ్ శివకేశవరెడ్డి నర్సాపురం 2,40,000/-
7. కంచె నారాయణ,గోవర్ధనగిరి -1,00,000/-
సీఎం సహాయనిధి అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో తుగ్గలి,వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.