PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్రో బాల్ పోటీల్లో విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాలలో నిన్న జరిగిన ఉమ్మడి కర్నూలు జిల్లా త్రోబాల్ పోటీల్లో కర్నూల్ నగర శివారులోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను చాటారు. గత మూడు రోజులుగా నంద్యాలలో 7వ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి స్మారక జిల్లాస్థాయిత్రోబాల్ పోటీలలో 108 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు పాల్గొన్నాయి. నంద్యాలలోని గురు రాఘవేంద్ర విద్యాసంస్థ సంస్థ వారు నిర్వహించిన పోటీల్లో  బాలుర విభాగంలో ద్వితీయ స్థానాన్ని, బాలికల విభాగంలో తృతీయ స్థానాన్ని, కైవసం చేసుకుని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల తన ప్రతిభను చాటుకుంది‌. గెలుపొందిన విద్యార్థులను ఈరోజు అనగా 31 వ తేదీ అక్టోబర్ ఉదయం 10 గంటలకు స్థానిక విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో అభినందిస్తూ అభినందన సభ జరిగింది. ఈ సభలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చదువులో భాగంగా ఆటలు ఉండాలని ,ఆటలలో నైపుణ్యాన్ని పొందినవాడే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని తెలియజేశారు‌. విజ్ఞానపీఠం కార్యదర్శి శ్రీ పీపీ గురుమూర్తిగారు అధ్యక్షత వహించి మాట్లాడుతూ విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల అంటే జిల్లాలో త్రోబాల్ పోటీలకు మరో పేరుగా నిలిచిందని తెలిపారు. శ్రీ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్ రామిరెడ్డిని శాలువాతో  సత్కరించారు. శ్రీ రామిరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల నుండి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి వరకు  విద్యార్థులు వెళ్తున్నారనిఅన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ చంద్రమోహన్, శ్రీ సుదర్శనం, శ్రీ నాగేశ్వర్రెడ్డి, శ్రీమతి స్వర్ణలత, శ్రీ సోమయ్య శ్రీ రణధీర్ రెడ్డి ,శ్రీ వంశీ రాఘవ ,శ్రీ మురళి  విద్యార్థులకు సర్టిఫికెట్లను ,మెడళ్ళను, బహుమతులను అందజేశారు.

About Author