PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలు

1 min read

– ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ను పరిశీలించిన కేంద్ర ఎన్నికల FLC పరిశీలకులు EVM ల నోడల్ అధికారి లలిత్ మిట్టల్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ను కేంద్ర ఎన్నికల FLC పరిశీలకులు EVM ల నోడల్ అధికారి లలిత్ మిట్టల్ పరిశీలించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని ఈ.వి.యమ్ గోడౌన్ లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలను కలెక్టరేట్ లోని కమెన్డ్ కంట్రోల్ రూమ్ ను కేంద్ర ఎన్నికల FLC పరిశీలకులు EVM ల నోడల్ అధికారి లలిత్ మిట్టల్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్ర ఎన్నికల FLC పరిశీలకులు EVM ల నోడల్ అధికారి లలిత్ మిట్టల్  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్లకు సంబంధించి FLC కార్యక్రమం బెల్ ఇంజనీర్లు, రెవెన్యూ  సిబ్బంది నిర్వహిస్తున్న ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సిబ్బంది హాజరు పట్టికను అలాగే సెక్యురిటీగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుపట్టికను, లాగ్ రిజిస్టర్, పొలిటికల్ పార్టీ రిజిస్టర్ ను, కూడా పరిశీలించారు. గోడౌన్ లోని , భద్రతపై పోలీసుల డ్యూటీస్ గురించి ఎన్ని షిఫ్టులుగా పనిచేస్తున్నారు షిఫ్ట్ కి ఎంతమంది ఉంటారు తదితర అంశాలను గురించి ఆరా తీశారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీల పై సంతృప్తి వ్యక్తం చేశారు . అనంతరం కలెక్టరేట్ లోని ఎన్నికలకు సంబంధించిన కమెన్డ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు, విధి నిర్వహణలో ఇక్కడ ఎంతమంది ఉంటారు, వెబ్ కాస్ట్ కంటిన్యూగా పనిచేస్తుందా సిబ్బంది కూడా కంటిన్యూ గా ఉంటారా అన్న తదితర విషయాలను గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్,ఈవీఎం ల FLC(ఫస్ట్ లెవెల్ చెకప్) నోడల్ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author