PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిడ్నీలపై అవగాహన పెంచుకోండి

1 min read

డాక్టర్​ సాయివాణి, ఎండి,డి.ఎం, నెఫ్రాలజి, కర్నూలు

పల్లెవెలుగు: మూత్రపిండాలు మన శరీరంలో అతిముఖ్యమైన అవయవాలు.శరీరం యొక్క రోజు వారి విధుల్లో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని, కాబట్టి మూత్ర పిండాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు నెఫ్రాలజి వైద్యులు డాక్టర్​ సాయివాణి, ఎండి,డిఎం కర్నూలు. కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కిడ్నీ సమస్యలు– తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు , ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్​ పి. చంద్రశేఖర్​ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెఫ్రాలజి వైద్య నిపుణులు డా. సాయివాణి ఎండి,డిఎం క్షుణ్ణంగా అవగాహన కల్పిస్తారని, కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డా. పి. చంద్రశేఖర్​ కోరారు.

About Author