PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలకి ఆర్టీసీ బస్సు సర్వీసులు..

1 min read

నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10 తేదీలలో..

దసరా సందర్భంగా సర్వీస్ చేసిన సిబ్బందికి ధన్యవాదాలు..

సహకరించిన ప్రయాణికులకు కృతజ్ఞతలు..

ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.వి.ఎస్ వరప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం , నూజివీడు డిపోల నుండి కార్తీక మాసం సందర్భంగా నవంబర్19, 26,డిసెంబర్ 3,10 తేదీలలో పంచారామ క్షేత్రాలకి ప్రతి ఆదివారం రాత్రి ప్రత్యేక బస్సులు నడపబడుచున్నవని ఎన్ వి ఆర్ వర ప్రసాద్  శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ బస్సులు అమరావతి,భీమవరం, పాలకొల్లు,ద్రాక్షారామం ,సామర్లకోట ఈ ఐదు క్షేత్ర దర్శనం అనంతరం గమ్యస్థానాలకు చేరుకుంటాయి. సూపర్ లగ్జరీకి పెద్దలకు 1200/ 1000 రూపాయలు .అల్ట్రా డీలక్స్ పెద్దలకి 1100/ పిల్లలకి 850/ ఎక్స్ ప్రెస్ పెద్దలకు 1000/ పిల్లలకి 750 / గా చార్జీలు నిర్ణయించడమైనదని తెలిపారు. సౌకర్యవంతమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి దైవ దర్శనాలు చేసుకొని క్షేమంగా గమ్యం చేరాలని ప్రతి బస్ స్టేషన్ నందు, ఆన్లైన్ బుకింగ్ లో రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయడమైందన్నరు, అదేవిధంగా ప్రతి సంవత్సరం శబరిమలై యాత్రికుల కోసం ఏడు రోజులు తొమ్మిది రోజులు ప్రత్యేక ప్యాకేజీల ప్రారంభించామని, దీక్ష స్వాములకు కోరుకున్న విధంగా ప్యాకేజీ ఏర్పాటు చేయబడినని తెలిపారు. 30,లేక 50 మంది ప్రయాణికులు వారు కోరుకున్న తీర్థయాత్రలకు ప్రయాణించే విధంగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. యాత్రలు చేసే ప్రయాణికుల అవసరార్థం ఏసీ బస్సులను కూడా సిద్ధం చేశామన్నారు. గడచిన దసరా సందర్భంగా ఏలూరు జిల్లా నుండి  సుమారు 350 అదనపు బస్సులను విజయవాడ, హైదరాబాదు, రాయలసీమ నడపడం జరిగిందని తద్వారా దాదాపుగా 88 లక్షలు అదనంగా ఆర్టీసీకి ఆదాయం చేకూరిందని తెలిపారు.  సహకరించిన ఆర్టీసీ కండక్టర్లకు, డ్రైవర్లకు, డిపో మేనేజర్లకు, సూపర్వైజర్లకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ప్రత్యేక శ్రద్ధతో బస్సులకు సర్వీస్ చేసినవారిని కొంతమందిని గుర్తించి వారికి  సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నమని. ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి  ఎన్ వి ఆర్ వరప్రసాద్ పాత్రికేయులకు తెలియజేశారు. ఏలూరు డిపో మేనేజర్ బి వాణి పాల్గొన్నారు.

About Author