టీడీపీ వైపు…ప్రజల చూపు..!
1 min readకర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టి.జి భరత్
- చల్లా వారి వీధిలో పర్యటించిన టి.జి భరత్
- టిడ్కో ఇళ్ళు, త్రాగునీరు, వీధిలైట్లు, పింఛన్లు, మురుగు కాల్వల సమస్యలు మొరపెట్టుకున్న స్థానికులు
- గెలిచిన తర్వాత సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చిన టిజి భరత్
పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. టిడిపి వస్తే ప్రజలపై పడుతున్న పన్నుల భారం తగ్గి, కుటుంబ ఆదాయం పెరుగుతుందని ప్రజల నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అన్నారు. మంగళవారం నగరంలోని 42 వ వార్డు పరిధిలోని చల్లా వారి వీధిలో ఆయన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు టిడ్కో ఇళ్ళు, త్రాగునీరు, వీధిలైట్లు, పింఛన్లు, మురుగు కాల్వల సమస్యలు మొరపెట్టుకున్నారు. తాను గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తానని టిజి భరత్ హామీ ఇచ్చారు. అనంతరం టిడిపి మొదటి విడతగా విడుదల చేసిన మినీ మేనిఫెస్టో చూపిస్తూ సంక్షేమ పథకాల గురించి వివరించారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన ఉంటుందన్నారు. పెరిగిపోయిన ధరలు నియంత్రణలో ఉండాలన్నా, ప్రజల పడుతున్న కష్టాలు తీరాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూల్లో తాను గెలిచిన వెంటనే ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వాలని మహిళలను అభ్యర్థించారు. యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఎస్. వలి, చంద్రశేఖర్, హరి, తిమ్మారెడ్డి, రామక్రిష్ణ, దిలీప్, షాషావలి, సత్యారెడ్డి, రంజిత్, శేషు, అయ్యన్న సురేఖ ఉమ, ఆఫ్రిన్, మాధవి, తదితరులు పాల్గొన్నారు.