గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన మండలం టిడిపి కన్వీనర్
1 min readదేశం సత్యనారాయణ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలంలోని స్థానిక గడివేముల గ్రంధాలయం లో గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయాధికారి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన గ్రంధాలయ వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, గడివేముల సర్పంచ్ రవణమ్మ లు పాల్గొని గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రంధాలయాలు భావితరాలకు దిశానిర్దేశం చేసే సూచికలు , సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని,గ్రంథాలయంలో విజ్ఞాన సంబంధం అయిన పుస్తకాలు,మనసుకు ఆనందపరిచే వినోద పుస్తకాలు,విద్యా ఉద్యోగ సంబంధిత సమాచార వివరాలు,ఆధ్యాత్మికత విషయాలలో జ్ఞానాన్ని పెంపొందించుకోని విద్యార్థినీ విద్యార్థుల వికాసానికి తోడ్పడే అంశాలతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉంటూ సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయని గ్రంథాలయానికి వచ్చి పాఠ్యపుస్తకాలను అభ్యసించడం ద్వారా సమాజ శ్రేయస్సు కొరకు చేపట్టవలసిన విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం గడివేముల సర్పంచ్ రవణమ్మ మాట్లాడుతూ గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి గ్రంధాలయాలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, విద్యార్థులు మరియు ఔత్సాహికులు గ్రంధాలయాలను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంచుకోవలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గడివేముల గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర రెడ్డి,దేశం రమణారెడ్డి,గ్రామ ప్రజలు,విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠకులు పాల్గొన్నారు.