వీరి సేవలు.. వెలకట్టలేనివి..!
1 min readనిరంతర ప్రజా సేవకులు.. పారిశుద్ధ్య కార్మికులు..
- డిపిఓ శ్రీనివాస్ విశ్వనాధ్
- ముఖ్యమంత్రి పర్యటనకు యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు
ఏలూరు:కార్యక్రమం ఏదైనా పారిశుధ్య కార్మికులు ఉండవల్సిందే. ఎంత గొప్ప మహానుభావుడు పర్యటన ఉన్నా శానిటేషన్ సక్రమంగా జరగకపోతే ఆ కార్యక్రమానికి విలువుండదు. ప్రముఖులు వస్తున్నారు అంటే చాలు అధికారులకు మొదటగా గుర్తొచ్చేది చెత్త ఊడ్చే కార్మికులు. ఎండనక, వాననక రాత్రిపగలుతో సంబంధం లేకుండా జిల్లా యంత్రాంగానికి తోడుగా నేనున్నాని పారా పరగా ఎత్తి, చీపురి పట్టుకొని రోడ్లు, డ్రైనేజీ ఊడ్చడానికి మొదటి అడుగు వేసేది పారిశుధ్య కార్మికులే. పారిశుధ్య పనులు నిర్వహణ అంటే ఆషామశి పనికాదు. చాలీ చాలని వేతనాలతో అధిక గంటలు పనిచేస్తు ప్రజా ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రసుగా మారిన కార్మికులు ఎప్పటికి అభినందనీయులు అందుకే అందరితో శబాష్ అనిపించుకుంటున్నారు మన కార్మికులు. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూజివీడు రానున్న సందర్భంలో పట్టణంతో పాటు, నూజివీడు పరిసర గ్రామీణ ప్రాంతాలను శుభ్రపర్చడానికి జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ 325 మంది కార్మికులను సమకూర్చి పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టగా మున్సిపల్ కమీషనర్ సయ్యద్ 150 మంది కార్మికులతో నూజివీడు పట్టణానికి మెరుగులు దిద్దారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్బంగా గత 5 రోజుల నుంచి కార్మికులు నిరాటంకంగా పనిచేస్తూ నూజివీడు పట్టణాన్ని, పరిసర ప్రాంతాలను సుందరీకరణంగా తీర్చిదిద్దారు. ఈ ఆధునిక యుగంలో యంత్రాలు ఎన్ని వచ్చిన పారిశుధ్య కార్మికుల పనితనానికి ఎక్కడ వన్నెతగ్గలేదని మరోసారి మన కార్మికులు నిరూపించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధానంగా హెలికాప్టర్ ప్యాడ్ ఏరియా, బహిరంగ సభప్రాంగణం, రోడ్డు షో, పార్కింగ్ ఏరియా ప్రధాన అంశాలు. పర్యటన విజయవంతం కావాలంటే జన సమీకరణతో పాటు ఈ ప్రాంతాలను పగడ్బెందిగా తీర్చిదిద్దాలి. అంటే పారిశుధ్య కార్మికుల ముందస్తు సహకారం లేనిదే మిగిలిన పనులు ఒక్కడుగు కూడా ముందుకెళ్ళవు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి నూజివీడు డివిజనులో దాదాపు అన్ని గ్రామాల నుంచి కార్మికుల సేవలు వినియోగించారు. జగన్మోహన్ రెడ్డి పర్యాటలో భాగంగా మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు నూజివీడు రానున్న సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు పారిశుధ్య నిర్వహణ చర్యలు రాజీకుండా సక్రమంగా చేపట్టమని, ప్రముఖుల పర్యటనలు విజయవంతం కావాలంటే పారిశుధ్య కార్మికుల సహకారం అవసరం అని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను మెచ్చుకొంట ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది, సందర్బంగా కార్మికుల సేవలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు.