ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగుపరచాలి…
1 min read– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్లో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమీక్ష సమావేశం గురించి.
– ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ:—
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని పలు విభాగాలలో ప్రతి వారం ఇచ్చే టార్గెట్లను పూర్తయిన అనంతరం ఆరోగ్యశ్రీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేసిన పలు విభాగాల హెచ్.ఓ డీ లను అభినందించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని పలు మెడికల్ డిపార్ట్మెంట్ విభాగాల ఆరోగ్యశ్రీని మరింత ఇంప్రూవ్మెంట్ చేయాలి అని సంబంధించిన హెచ్చోడిలను ఆదేశించారు.ఆసుపత్రి లో క్యాజువాలిటీ విభాగంలోని ఈ హాస్పటల్ పోర్టల్ నందు అప్లోడింగ్ ప్రాసెస్ ప్రారంభించాలని సంబంధించిన సంబంధిత CMO మరియు HOD లను ఆదేశించారు.అన్ని ఎమర్జెన్సీ మరియు క్యాజువాలిటీ కేసుల కోసం న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్‌లో 24/7 CT సేవలను చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కార్డియాలజీ విభాగం న్యూ క్యాథ్‌ల్యాబ్ మరియు బ్లడ్ బ్యాంక్ న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి HOD లు మరియు వైద్య సిబ్బంది హాజరు కావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, కర్నూలు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డా.హరి చరణ్, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.శ్రీనివాసులు డా.సీతారామయ్య, డా. శ్రీలక్ష్మి బాయ్, డా.రాధరాణి, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.