ఏపీలో బహుజన వర్గాలు చైతన్యవంతులు కావాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: సమాజ్ వాదీ పార్టీ సామాజిక న్యాయ సూత్రం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో పోటీ నంద్యాల సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ని చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిసి నంద్యాల జిల్లాలోని అన్ని పాలక పార్టీలు స్థితిగతులపై సామాజిక న్యాయస్థితిగతులపై చర్చించారు. అనంతరం పెరుగు శివ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా పాలిస్తున్న పాలక పార్టీలు సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నారని ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ధ్యేయం అంటూనే బడుగు బలహీన వర్గాలను అంచి వేస్తున్నారు అని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.అందుకు స్పందించిన అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు విద్య ఉద్యోగ ఉపాధి నిధులు రాజకీయ గా ఎవరి కుల జనాభా ఎంతో వారికి అంత వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయం చేరువవుతుందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన వర్గాలు చైతన్యవంతులు కావాలని 2024 ఎన్నికలలో సామాజిక న్యాయమే లక్ష్యంగా 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేయాలని బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఇంటి తలుపు తట్టి ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర జిల్లా అధ్యక్షులపై ఉందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు.