‘నీళ్లు తాగండి’ అనడంతో.. 29 వేలకోట్లు నష్టపోయిన కొకో కోల
1 min readపల్లెవెలుగు వెబ్: కొకొకోల ప్రపంచంలోనే ప్రముఖ బెవరేజెస్ కంపెనీ. అమెరికాలో మొదలైన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ ను విస్తరించింది. కొకొకోలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కూల్ డ్రింక్ అంటేనే కొకొకోల అని గుర్తుకు వచ్చేంతగా ప్రజల్లో గుర్తింపు పొందింది. కొకొకోల కంపెనీలో షేర్లు కొన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు సిరులు కురిపించింది ఈ కంపెనీ. అలాంటి కొకొకోల కంపెనీ ఓ ఆటగాడు చెప్పిన ఒక్క మాటతో 29 వేల కోట్లు నష్టపోయింది. ఈ టోర్నీకి కొకొకోల కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. యూఈఎఫ్ఏ యూరో 2020 మ్యాచ్ కు ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. పోర్చుగీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డొ , మేనేజర్ ఫెర్నాండో సాంటస్ లు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. టోర్నీ స్పాన్సర్ అయినందున కొకొకోలా బాటిల్స్ వారి ప్రెస్ మీట్ టేబుల్ మీద పెట్టారు. క్రిస్టియానొ రొనాల్డొ ఆ రెండు కొకొకోలా బాటిల్స్ పక్కన పెట్టి.. మంచి నీళ్లు తాగండి అని చెప్పారు. దీంతో ఆ మాటలు కొకొకోలా షేరు ధర మీద తీవ్ర ప్రభావం చూపింది. ఆయన వ్యాఖ్యలు సాధారణంగా చేసినప్పటికీ.. స్టాక్ మార్కెట్ లో కొకొకోలా షేరు ధర 1.6 శాతం నష్టపోయింది. ఫలితంగా 29 వేల కోట్ల సంపద ఆవిరైంది.