నంద్యాల జిల్లా కలెక్టర్ ని ఆదేశించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్. పి .లక్ష్మణ రెడ్డి.
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: నంద్యాల జిల్లా (పూర్వపు కర్నూలు జిల్లా), శిరివెళ్ళ మండలం, రాజానగరం గ్రామంలోని క్రాంతి గ్రామైఖ్య సంఘం మార్కెటింగ్ కొనుగోలు కమిటీ దుర్వినియోగం చేసిన రూ.3,82,845/- లను మార్కెటింగ్ (కొనుగోలు కమిటీ) అధ్యక్షురాలు నారిశెట్టి పద్మావతి, క్రాంతి గ్రామైఖ్య సంఘ అధ్యక్షురాలు మానుకొండ లక్ష్మీదేవిలు దుర్వినియోగం చేసిన రూ.3,82,845/-లు తిరిగి వసూలు చేయాలని, నంద్యాల జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని. కృష్ణాజిల్లా ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.ఫిర్యాదులున్న ఈ అవినీతికి జరగడానికి కారకులైన పూర్వపు కర్నూలు డి.ఆర్.డి.ఏ.కు చెందిన 14 మంది అధికారులపై క్రమశిక్షణాచర్యలు తీసుకొని, 2024, ఫిబ్రవరి 1వ తేదీ లోపు తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మార్కెటింగ్ (కొనుగోలు కమిటీ), క్రాంతి గ్రామైఖ్య సంఘాల అవినీతిపై కృష్ణాజిల్లా, ఉయ్యూరుకు చెందిన స.హ. చట్టం కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్, కర్నూలు జిల్లా, రాజానగరంకు చెందిన స.హ. చట్టం కార్యకర్త శిరివెళ్ళ గౌరి రాష్ట్ర లోకాయుక్తగారికి ది. మే నెల 12వ తేదీన2021 సంవత్సరంలో చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరిగింది. రాజానగరం గ్రామంలోని క్రాంతి గ్రామైఖ్య సంఘం, మార్కెటింగ్ (కొనుగోలు కమిటీ) ఆధ్వర్యంలో 2009వ సంవత్సరం నుండి 2020వ సంవత్సరం వరకు రైతుల నుండి ధాన్యం, ఇతర చిరుధాన్యాలు కొనుగోలు చేయడం జరిగింది. షుమారు 4 కోట్ల 80 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యం, ఇతర చిరుధాన్యాలను ఈ కమిటీ కొనటం జరిగింది. ఈ మార్కెటింగ్ ద్వారా క్రాంతి గ్రామైఖ్య సంఘానికి రూ.16,19,000/-లు కమీషన్గా రావటం జరిగింది. ఈ కమీషన్ (లాభాలు)ను రాజానగరం గ్రామంలోని 19 పొదుపు సంఘాలకు కేటాయించవలసి ఉండగా, ఈ నిధులను కొనుగోలు కమిటీ అధ్యక్షురాలు నారిశెట్టి పద్మావతి, క్రాంతి గ్రామైఖ్య సంఘ అధ్యక్షురాలు మానుకొండ లక్ష్మీదేవి దుర్వినియోగానికి పాల్పడటం జరిగింది.కర్నూలు జిల్లా డి.ఆర్.డి.ఏ. అధికారులకు ‘కీర్తి పొదుపులక్ష్మి గ్రూపు లీడర్ (స.హ.చట్టం కార్యకర్త)శిరివెళ్ళ గౌరి ఫిర్యాదు : ఈ మార్కెటింగ్ (కొనుగోలు కమిటీ) అవినీతిపై ది. 13-10-2020 నుండి కర్నూలు జిల్లా.
డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్ట్ డైరక్టర్ ఎం.కె.వి. శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరక్టర్ వై.వి.శ్రీధర్రెడ్డిలకు స్వయంగా శిరివెళ్ళ గౌరి ఫిర్యాదు చేసినా, ఈ అవినీతిపై జిల్లా అధికారులు సక్రమంగా విచారణ జరపకపోగా, కొనుగోలు కమిటీ అధ్యక్షురాలు నారిశెట్టి పద్మావతి, క్రాంతి గ్రామైఖ్య సంఘ అధ్యక్షురాలు మానుకొండ లక్ష్మీదేవిలకు అండగా నిలిచారు.
రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి ఫిర్యాదు : ఈ మార్కెటింగ్ కొనుగోలు కమిటీ అవినీతిపై స.హ.చట్టం
ద్వారా సమాచారం సేకరించిన స.హ.చట్టం కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్, శిరివెళ్ళ గౌరిలు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి కి ది.12-05-2021న ఫిర్యాదు చేయడం జరిగింది. నిఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
లోకాయుక్త ఇనవెస్టిగేషన్, డైరక్టర్ను విచారణకు ఆదేశించడం జరిగింది. లోకాయుక్త ఇనవెస్టిగేషన్ డిప్యూటీ డైరక్టర్ , వెంకటరమణారెడ్డి ఈ మార్కెటింగ్ కొనుగోలు కమిటీ అవినీతిపై విచారించి రూ.3,82,845/-ల దుర్వినియోగం జరిగిందని, ఆ నిధులను వసూలు చేయాలని నివేదిక సమర్పించారు. అలాగే ఈ అవినీతికి పరోక్షంగా కారకులైన 14 మంది డి.ఆర్.డి.ఏ. అధికారులపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని తన నివేదికలో పేర్కొన్నారని కృష్ణాజిల్లా ఉయ్యూరు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.