రైతులు పంట నమోదు చేసుకోవాలి
1 min readమండల వ్యవసాయ అధికారి శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రబీ 2023 సంవత్సరంకుగాను ఈ పంట నమోదు ప్రారంభించబడినదని మండలంలోని పంట వేసిన రైతులు అందరూ మీ గ్రామ పరిధిలోని రైతు భరోసా కేంద్రంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని పట్టాదారు పాసుబుక్ లేదా Ccrc కార్డు, ఆధార్ కార్డుతో సంప్రదించవలెనని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు, గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మండలంలో పంట వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోనవలెనని, ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారా పంట కొనుగోలు చేయుటకు, సున్నావడ్డి, పంట రుణాలు వంటి పంట నష్టపరిహారం పొందుటకు రైతులకు వెసులుబాటు కలుగుతుందని ఆమె తెలిపా, కాబట్టి రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోనవలెనని ఆమె తెలిపారు, అదేవిధంగా ఉప్పర పల్లెలో పంట నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగినదని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో వి ఏ ఏ సలోమి, స్వీటీ రైతులు పాల్గొన్నారు.