లక్ష్మీపురంలో ఘనంగా.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర..
1 min readఅభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే సంకల్ప్ యాత్ర లక్ష్యం..
ప్రతిజ్ఞ చేయించి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించిన డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భారదేశాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. భీమడోలు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఘనంగా ప్రారంభం అయ్యింది. కార్యక్రమానికి వచ్చిన స్థానికులు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన మెగా స్క్రీన్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాన్ని తిలకించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమం కార్యక్రమాలుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ పీఎం ఉజ్వల పథకాన్ని, అటల్ పెన్షన్ పథకాన్ని, జల్ జీవన్ మిషన్ పథకాన్ని, మిషన్ ఇంద్రదనుస్సు, పీఎం ఆవాస్ యోజన, జనని సురక్ష యోజన, పీఎం పోషణ యోజన తదితర పథకాలను ప్రజలు ఉపయోగించు కోవాలని డీపీఓ అన్నారు. కార్యక్రమానికి ముందు స్వయం అభివృద్ధి దేశంగా భారతీదేశాన్ని తీర్చిదిద్దడానికి అందరు సహకరించాలని డీపీఓ శ్రీనివాస అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సందర్బంగా మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషక ప్రదర్శన, వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎంపీడీఓ, పద్మావతి దేవి, విస్తరణ అధికారి ఏ. సుందరి, వైద్య అధికారి శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మురళి కృష్ణ తదితరులు పాల్గున్నారు.