విద్య, వైద్య రంగానికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట
1 min readసచివాలయాలతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
శభాష్ పురం గ్రామ పంచాయతీలో రూ 86.78 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
103 మంది రైతులకు ఉచితంగా జలకళ బోర్లు
35 మంది రైతులకు విద్యుత్ మోటర్లు పంపిణీ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య,వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ, గ్రామస్థాయిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. శుక్రవారం ఉదయం శభాష్ పురం, దిగువ చింతల కొండ గ్రామపంచాయతీలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. శభాష్ పురం గ్రామంలో రూ 23.94 లక్షలతో చేపట్టిన రైతు భరోసా కేంద్రం, 20.94 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్, అలాగే దిగువచింతల కొండ గ్రామంలో 32 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు ఎమ్మెల్యే శ్రీదేవమ్మను గజమాలతో సన్మానించి, మేళతాళాలతో బాణా సంచులు కాల్చుతూ, ఘన స్వాగతం పలికి ,భారీ ఊరేగింపు నిర్వహించారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి?అనే కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పార్టీ జెండాను, సచివాలయంలో సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ, వైయస్సార్ జలకల పథకం కింద 103 మంది రైతులకు ఉచితంగా జలకల బోర్లు వేసి, 35 మంది రైతులకు విద్యుత్ మోటార్లను ఉచితంగా పంపిణీ చేశామన్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే భావితరాలకు బంగారు భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు.దేశంలో మరి ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సంక్షేమ అభివృద్ధి జరగాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావల్సిందేనని అన్నారు.జగనన్న సుపరిపాలన చరిత్రలో ప్రత్యేక అధ్యాయమని అన్నారు. చరిత్రలో కూడా ఎన్నడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి ప్రగతి పట్టాలపై దూసుకెళుతుందన్నారు. గతంలో టిడిపి పాలనకు ఇప్పటి వైఎస్ఆర్సిపి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలందరూ గమనించాలని, మేలు జరిగిందని భావిస్తే మళ్లీ జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలన రాష్ట్రంలో చేశారని, ఆ పాలనే మరల కొనసాగిస్తామని చెప్పే ధైర్యం తెలుగుదేశం నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. 4 సంవత్సరాలలో జగనన్న చేసిన పాలన మరల ఇదే పాలన చేస్తామనే చెప్పే దమ్ము వైకాపా నాయకులకు ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శభాష్ పురం గ్రామపంచాయతీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.