PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్సిపి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం

1 min read

– గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిన వైనం

– నేడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత

– సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగున్నర సంవత్సరముల లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ను, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే కాకుండా, వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని నియోజకవ వర్గాల ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానిలో భాగంగానే ఈ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు, సోమవారం సాయంత్రం ఆయన సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతం అయినందుకు మండల వైఎస్సార్సీపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు కృతజ్ఞత లు తెలిపేందుకు రావడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని కులాల వారిగా, చేతి వృత్తుల వారికి ఇస్త్రీ పెట్టెలు, డప్పులు, పనిముట్లు అందజేసి చేతులు దులుపుకునే వారని ఆయన తెలిపారు, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారిని ఉన్నత స్థాయి పదవులలో నిలబెట్టడం జరిగిందన్నారు, అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 54 చైర్మన్ పదవులు 600 వందల డైరెక్టర్ల పదవులు ఇచ్చి వారిని గౌరవించడం జరిగిందన్నారు, అంతేకాకుండా చట్టసభలలో వారికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా 101 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతం గా కొనసాగిందని 102 వ సామాజిక సాధికార బస్సు యాత్ర కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు మండలంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించిన కొండపేట బ్రిడ్జి వద్ద జరిగిన ఈ బస్సు యాత్రలో తండోపతండాలుగా వైఎస్ఆర్సిపి శ్రేణులు, ఎస్సి ఎస్టి బిసి మైనార్టీ సోదరీ సోదరీమణులు, పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు, గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విజయవాడ దుర్గమ్మ వారధి మీద పాదయాత్ర చేయడం జరిగిందని, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి వారధిమీద పాదయాత్ర చేయడం ఒక సంచలనమని, నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చెల్లూరు మండలం కొండపేట వారధి మీద తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మరో సంచలనమని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా, తమకు ఇంత గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు మండలంలోని పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఆయన తెలియజేశారు, అదేవిధంగా రాబోవు 2024లో జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఆయన అన్నారు, ఎంతో చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రోత్సాహాలు అందించి వారికి అధిక ప్రాధాన్యతను కల్పించి, చైర్మన్లు, డైరెక్టర్లు, చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాబోయే రోజులలో కార్యకర్తలను ఆదుకుంటారని, నిన్న జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనాలు రావడం లో కృషి చేసిన మండల నాయకులు అందరికీ ఆయన పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, వైయస్సార్ సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, చల్లా వెంకటసుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్, హస్రత్, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, అబ్దుల్ రబ్, సాదు కిషోర్, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author