కర్నూలు జీజీహెచ్లో అకాడమిక్ DME డా.రఘునందన్ పర్యటన
1 min readఅకాడమిక్ DME డా.రఘునందన్, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ, పలు ఒపి జనరల్, మెడికల్ ఓపి, సర్జరీ, ఆర్తో ఒపి, మరియు ఓపి రిజిస్ట్రేషన్ కౌంటర్ మరియు న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో బ్లడ్ బ్యాంక్ మరియు బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, సిటీ స్కాన్, విభాగాలు ఆక్సిజన్ ప్లాంట్ BSA ప్లాంటు మరియు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, విభాగాలను సందర్శించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని ఎంసిహెచ్ విభాగంలోని చిన్న పిల్లల వార్డులో నూతన NICU మరియు SNCU, MNCU నిర్మాణంలో ఉన్న విభాగాలను పరిశీలించి అనంతరం వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ ఐపీ మరియు ఒపి కేంద్రాలను పరిశీలించి అనంతరం ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ మరియు ఓపి కౌంటర్ పరిశీలించారు అనంతరం వాటి గురించి ఆరా తీశారు.AP లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ 90% జరగనున్నట్లు తెలియజేశారు.ఆసుపత్రిలోని (JAS) జగనన్న ఆరోగ్య సురక్ష కౌంటర్లు ఉన్నాయి JAS ప్రకారం కౌంటర్లు ఏమేం ఇస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.కర్నూల్ వైద్య కళాశాలలో కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ విభాగాల HODs తో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.వైద్య కళాశాలలోని ఫ్యాకల్టీ డిప్సిటి ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.ఆసుపత్రి మరియు వైద్య కళాశాలలో NMC ఇన్స్పెక్షన్ ఉండనున్నట్టు తెలిపారు అనంతరం విభాగాలలో ఫ్యాకల్టీ డిప్సిటి ఏమైనా ఉన్నాయా, ఆ వివరాలు తీసుకొని వాటిని ఫిలప్ చేయనున్నట్లు తెలియజేశారు.డాక్టర్స్ SRల కొత్త రిక్రూట్మెంట్ ఈనెల 13వ తేదీ నుండి జరుగునున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డా.హరిచరణ్, డా. రేణుకాదేవి, డా.సాయి సుధీర్, REH సూపరింటెండెంట్, డా.పృథ్వి వెంకటేష్, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, హెచ్వోడీస్, డా. శ్రీలక్ష్మి బాయ్, డా.పద్మ విజయ శ్రీ, డా. వెంకటేశ్వర్లు, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నారు.