మొక్కలు నాటి.. సంరక్షిద్ధాం..
1 min read– ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమబూబ్బాష
పల్లెవెలుగువెబ్, కర్నూలు: వాతావరణ కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఎన్డబ్ల్యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమబూబ్బాష. పరిసరాలు శుభ్రంగా.. పచ్చదనంగా ఉంటేనే జీవరాశి మనుగడ ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఎన్డబ్ల్యూపీ తరుపున మూడు రోజులపాటు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి… వాటి సంరక్షణ బాధ్యత కూడా కార్యకర్తలకు అప్పగించారు. నగరం పచ్చదనంతో కళకళలాడాలన్నారు. పార్టీ తరుపున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న తమకు.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కార్యక్రమంలో ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ, శ్రీరామ్ నగర్ ఇంఛార్జి విజయమ్మ, కొత్తపేట ఇంఛార్జి ప్రసన్న, పి.ఆర్.ఓ.సురేఖ, మునగలపాడు ఈదన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.