PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శ్రీ భక్త కనకదాసు విగ్రహ  ప్రతిష్ట

1 min read

ఆనందోత్సవంలో కురువ, కురుబ సోదరులు

  • హాజరైన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి నాయకులు రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు, మంత్రాలయం:కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామంలో కురువ, కురుబ సంఘం పెద్దల అధ్వర్యంలో శ్రీ భక్త కనకదాసు స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు కలశములతో గ్రామ పుర వీధుల గుండా డప్పు, భాజభజంత్రీల మద్య ఊరేగింపు నిర్వహించారు. కనక దాసు విగ్రహానికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. హాజరైన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎంపి గోరంట్ల మాదవ్, టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి : – శ్రీ భక్త కనక దాసు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా వేరు వేరు సమయాలలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి లు హాజరయ్యారు. వీరి కి కురువ, కురుబ సంఘం పెద్దలు బాణసంచాలు కాల్చి డప్పు వాయిద్యాలతో గొరవయ్యల విన్యాసాలతో ఘనంగా స్వాగతం పలికారు. కనక దాసు విగ్రహానికి చేరుకుని  విగ్రహావిష్కరణ చేశారు. వీరి కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కురువ సోదరులకు శ్రీ భక్త కనకదాసు స్వామి అనుగ్రహం  ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కురువ సోదరులు కలిసిమెలిసి అందరూ ఓకే  సోదరుభావంతో ఉండాలని సూచించారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.    ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు భీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, టిడిపి నాయకులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, మాధవరం రామకృష్ణ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చావిడి వెంకటేష్, చంద్ర, భీమన్న,ఆచారి,చంద్ర, అబ్దుల్, బండ్రాల నరసింహులు, అయ్యన్న, ఎంకప్ప, చిన్నారెడ్డి,దస్తగిరి, చిదానంద, లింగప్ప,  గ్రామ కురువ సంఘం పెద్దలు పూజారి బీరప్ప, ట్రాక్టర్ బీరప్ప, శ్రీను, చలపతి, స్కూల్ విద్య కమిటీ ఛైర్మన్ నాగిరెడ్డి, కర్రెన్న, మల్లయ్య, గట్టెప్ప, బీరప్ప, రామలింగప్ప భీరలింగప్ప, శివరాముడు, రఘు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

About Author