శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్.రామరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో సీజేఐ ఎన్వీ రమణ దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేద పండితులు వేద మంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి సత్కరించారు.