క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది
1 min readకర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తోందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు.ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో కర్నూలు ఔట్ డోర్ స్టేడియం నుండి నిర్వహించిన మారథాన్ 3k రన్ కార్యక్రమాన్ని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగర మేయర్ బి. వై.రామయ్య జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తోందని యువత మొత్తం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఒకవైపు ప్రజల ఆరోగ్య సంక్షేమం తెలుసుకునేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు మరో వైపు ఫిట్ ఆంధ్రలో బాగంగా యువతను క్రీడలు వైపు ఆకర్షించేందుకు గాను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టి ఈ నెల 26 వ తేది నుండి ప్రారంభించడం జరుగుతుందని అందుకు గాను ఈరోజు మారథాన్ 3k రన్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు.నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో యువత పాల్గొని వారు ఎంచుకున్న క్రీడలలో ప్రతిభ కనపర్చాలన్నారు.కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జోసెఫ్ లక్ష్మయ్య, ఆడుదాం ఆంధ్ర కర్నూల్ ఇంచార్జ్ విజయ్ కుమార్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రత్నకుమారి, శారద తదితరులు పాల్గొన్నారు.