PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడీలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తాం

1 min read

అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి  కృషి చేస్తా..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  అంగన్వాడీలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. గురువారం కొత్తపల్లి మండలంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న  ఎంఎల్ఏ ఆర్థర్ ను మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిస్తున్న  అంగన్వాడీలు కలసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొగురు ఆర్థర్  మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో జీతాలు పెంచి పబ్బం గడుపుకునే మనస్తత్వం సీఎం జగన్ ది కాదన్నారు. ఎన్నికలు అయిన తరువాత మంచి చేయాలని చూసే గొప్ప మనస్తత్వమన్న నాయకుడన్నారు. టి డి పి హయాంలో అంగన్వాడీ వర్కర్లకు రూ.7 వేలు జీతం ఉండగా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే రూ. 11,500 లకు పెంచిన ఇషయాన్ని గుర్తు చేశారు. అలాగే హెల్పర్లు (ఆయాల)కు రూ. 4500 నుంచి రూ.7 వేలకు పెంచారన్నారు. అలాగే ఉత్తమ సేవలందిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లుకు ప్రోత్సాహంగా నెలకు రూ. 500 చెల్లిస్తోందన్నారు. వర్కర్లు, హెల్పర్లుకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచడం, అంగన్వాడీ వర్కర్లకు తమ సర్వీసు చివరి నాటికి రూ. 50 వేల బెనిఫిట్ ను రూ లక్షకు పెంచడం, హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచడంపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారన్నారు. హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్ గా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచడం, టిఏ, డిఏలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించడం జరుగుతోందన్నారు. 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ప్రమోషన్లు కల్పించి 560 గ్రేడ్ 2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు.సూపర్ వైజర్ పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయోపరిమితి పెంపు ఎంతో ఉపయోగపడిందన్నారు. వర్కర్లు, హెల్పర్లకు ఈ ఏడాది నుంచి ప్రమాద బీమా రూ.2 లక్షల వరకు చెల్లిస్తుండడం జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అంగన్వాడీలకు భవన నిర్మాణాలు, రిపేర్లు, సుందరీ కరణ, వాల్ పెయింటింగ్స్, మౌలిక సదుపాయాలు, తదితర  చర్యలతోనూ కార్పోరేట్ తరహాలో విద్యనందించేలా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. జీతాల పెంపు, ఏడేళ్ల నుంచి రావాల్సిన డిఏ లు, ఆప్స్ , సెల్ ఫోన్ అప్ డేట్స్, రిటైర్మెంట్ అయిన తరువాత పెన్షన్ పొందే సమస్యలను ప్రభుత్వ దృష్టికి బాధ్యతగా  తీసుకెల్తామన్నారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని అన్నారు. ఆశ వర్కర్లకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలను పెంచిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. జగనన్న సంపూర్ణ పోషణ కిట్ ద్వారా  బలవర్ధక ఆహారాన్ని ఇచ్చే కార్యక్రమం చాలా గొప్పదన్నారు.ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వమిదన్నారు. 

About Author